గోగు (గోంగూర) Hibiscus Cannabinus : Roselle

గోంగూర

తెలుగువారికి ప్రియతమైన ఆకుకూర గోంగూర.  పీలు, గుచ్చ ఫల, విరేచనా ఫల, శ్యామ, భేది, శ్యాఖి, ఉష్ణ ప్రియ, దీపన, భూమిజ అనేవి సంస్కృత నామాలు. 





గోగు ఉష్నంగా, లఘువుగా, బలకరంగా ఉంటుంది. ఇది దోషాలని భేదిస్తుంది.  రక్త పిత్తం, గుల్మం, ఆర్సస్సు, ప్లీహం, వాతం , కఫం వీటిని తగ్గిస్తుంది.  రసాయనంగా పని చేస్తుంది.  ఇందులో పోటాష్ కూడా ఉంటుంది. 

గోంగూరలో పుల్ల గోగు, ఎర్ర గోగు, తెల్ల గోగు, ధనాసర గోగు అని నాలుగు రకాలు ఉన్నాయి. 
పుల్ల గోగు :
దీని కాయలు ఎర్రగా కాని తెల్లగా గాని ఉంటాయి.  పుల్ల గోంగూర ఆకునే కాకా పువ్వులని కూడా పచ్చడి చేసుకొంటారు. 

ఎర్ర గోగు:
ఎర్ర గోఫు చెట్టు కాడలు బూడిద రంగుతో కలిసిన పచ్చని రంగుతో ఉంటాయి.

తెల్ల గోగు:
దీనినే దేశవాలి గొంగురా అని అంటారు.  ఇది సర్వ సామాన్యమనైది.

ధనాసర గోగు:
ఇది విదేశి గోంగూర. మలయా ద్వీప కల్పం లో ధనాసరి అనే ప్రాంతం లో ఉంది.  ఇది పత్యానికి మంచిది.  బాలింతలు కూడా దీనిని తినవచ్చు. 

ఇంతే కాదు పైర గోంగూర అని కూడా ఇంకో రకం ఉంది. దీనిని శీతల కలం లో పైరుగా వేస్తారు.  ఇది చాల రుచిగా ఉంటుంది. ఇది అన్ని రకాల గొంగురలో ఉత్తమమైనది. 

గుంటూరు గోంగూర :
గుంటూరు సీమ లో వచ్చే పైరును గుంటూరు గోంగూర అంటారు.  ఇది రుచిగా ఉంటుంది.  ఇది నిలవ పచ్చడిగా వాడుకలో ఉంది.  

గోంగూర మంచి బలకరమైన శ్యాకం. అందుచేతనే కోడి మాంసం తో దీని శక్తిని పోలుస్తారు.  రేచీకటి నయం అవుతుంది.  ఉడికించిన గోగు కూర నీళ్ళు తాగి చప్పిడి చేస్తే ఉబ్బు రోగాలు తగ్గుతాయని చెబుతారు.  గోగాకు ఉడికించి కడితే మెహ వ్రణాలు పక్వమౌతాయి. నేతి తో ఉడికించి కడితే వారి బీజాలు తగ్గుతాయి.  వేపాకు, గోంగూర కలిపి నూరి బోద కాళ్ళకు పట్టిస్తే గునకారి గా ఉంటుంది. 

గేదల లేగ దూడలకు నాలుగు లేదా  ఐదు గోగాకులు పెడతారు. అది తినడం వల్ల రేణం సాఫీగా వేసి బాగా ఆరోగ్యంగా ఎదుగుతాయి.

గోంగూరను కుష్టు రోగుల దరికి చేరనీయ కూడదు.



ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.


Share:

Labels

Blog Archive