చర్మము - రకములు

చర్మము  - రకములు
చర్మము అందరికి ఒకేలా ఉండదు. అసలు చర్మమే రక రకములు! అందుకే ...... మన చర్మము ఏ రకమో ముందుగా తెలుసుకోవాలి. చర్మము ఎలాంటిదో తెలుసుకూకుండా లేపనములను వాడితే ప్రయోజనము ఉండదు.



ఉదయము నిద్ర లేస్తూనే ....... ఒక పొడి టిష్యూ పేపర్ తీసుకొని ముఖము అంట దానితో రుద్దండి! ఆ టిష్యూ పేపర్ కనుక జిడ్డుగా మారితే ..... అది జిడ్డు చర్మమునకు సెంటర్ పాయింట్ అన్న మాట!  ఆ టిష్యూ పేపర్ మీద ఏ విధమైన జిడ్డు లేకపొతే..... మీది పొడి చర్మము లేదా నార్మల్ చర్మము అని గ్రహించాలి.  మీది పోసి చర్మము అవునో.... కాదో....... తెలుసుకోవాలంటే........ మీ ముఖమును సబ్బు  నీటితో శుభ్రము చేసుకోండి!  ఇప్పుడు ముఖము గట్టిగాను, బిగువుగాను ఉన్నట్టు తోస్తే.... అది పోదిచార్మము! ముఖము సబ్బునీతితో తోమిన తరువాత మృదువుగాను, ఎలాస్టిక్లా సాగుతున్నట్లు అనిపిస్తే.... మీది నార్మల్ చర్మము అన్న మాట.

నార్మల్ చర్మము
ఆరోగ్యవంతమైన నార్మల్ చర్మము ఎలాంటి లోపాలు ఉండక.... వేల్వెట్ లా  మెత్తగా ఉంటుంది. గుంటలు, మచ్చలు పెద్దగా ఉండవు.  కాని..... మొటిమలు ఉంటూ ఉంటాయి. మొటిమలు అంటే గుండె బాదుకోనేవారు ఎక్కువ.  మొటిమలు ఉన్న వారు చురుకుగా ఉంటారు. అనగా...... ఆ గ్రంధులు స్రవిస్తూ....... ఆక్టివిటీని ఇస్తాయి. మొటిమలను సులువుగా నివారించుకొవ్వచ్చు.

మొటిమల నివారణ :
ఉదయమే శుభ్రమైన నీటిని ఉపయోగించి, సబ్బుతో శుభ్రము చేసుకోండి. ముఖమును పన్నీరుతో కడగండి. అప్పుడు చర్మమునకు  ఏదైనా సున్నితంగా ఉండే చర్మ రక్షణ ఔషదం ను రుద్దండి. మీరు మేకప్ చేసుకునే ముందు తప్పని సరిగా మాయీశ్చరైజ్ను వాడాలి.


పొడి చర్మము
పొడి చర్మము అంత కాంతివంతంగా ఉండదు. డల్ ఉన్నట్లే కనిపిస్తుంది. బుగ్గలు, కళ్ళు వేల వేలబోతున్నట్లు ఉంటాయి. కళ్ళ కింద నల్లటి వలయాలు త్వరగా ఏర్పడుతుంటాయి. చలికాలము ఎక్కువ పగులుతూ ఉంటుంది. ఈ పొడి చర్మమునకు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. నోటి కిరు పక్కలా నల్లగా ఎర్పడుకుంటాయి. వీరికి చర్మములో ఉన్న నూనె గ్రంధులు సరిగా పని చేయవు. అందువలన శరీరమునకు నూనె చాలదు. అశ్రద్ద  చేస్తే .... చర్మము బాగా ముడతలు పడిపోతుంది. అందుకు ఎక్కువగా రోజ్ వాటర్ ను స్కిన్ టానిక్ తో రుద్దుకోండి. సబ్బుకు బదులుగా ఓట్ మీల్ గాని ఆల్మండ్ గాని రుద్దుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు మాయిశ్చరై జ్ క్రీంను రాయండి.  ఇంకా....... చర్మము పొడిగానే ఉంటే..... మంచి నౌరిషింగ్ క్రీం ను రాయాలి.  ఇరవై నిమిషాలు చర్మము పీల్చుకోగా మిగిలినది గుంటలు, మచ్చల దగ్గరగా  నిలబడి పోతుంది. చర్మము ఇంకిపోవుటకు  పది  నిమిషాలు చాలు!  ఇరవై నిమిషాలు ఆగితే ....... మనం రుద్దుకున్నది ఎక్కువగా ఉంటె అదీ తెలుస్తుంది.

జిడ్డు చర్మము
ఈ చర్మము ప్రకాసవంతం గా కనిపిస్తుంది.  కాస్త రంగు తక్కువగా కనిపిస్తారు. మొటిమలు ఎక్కువగా వస్తాయి. వీరికి నల్ల మచ్చలు కుడా వస్తుంటాయి. వీరు రోజుకు మూడు సార్లు ముఖము కడుక్కోవాలి. మాయిశ్చరై జర్ అస్సలు వాడ కుడదు అని లేదు తక్కువ జిడ్డు ఉన్న మాయిశ్చరై జర్ ను వాడవచ్చు.

మిశ్రమ చర్మము
ఇది రెండు రకాలైన చర్మము. అందుకని రెండు రకముల క్రీంలు వాడుకోవాలి. చెంపలు సామాన్యంగా పొడిగానే ఉంటాయి. పోడిచార్మమునకు వాడే క్రీంస్ నీ ముఖానికి వాడాలి. జిడ్డు చర్మానికి వాడే క్రీంలు కుడా వాడాలి. అప్పుడే  ఫలితం ఉంటుంది.

వయస్సు-వర్చస్సు
మీరు చర్మమును గురుంచి తగిన శ్రద్ధ తీసుకోకపోతే.... మీ వయస్సు కంటే మీరు పెద్దగా కనిపించవచ్చు. ఆడవారు తమ శరీరాన్నిచలి, ఎండల నుండి కాపాడుకోవాలి. అలాగే మానసిక వత్తిడి, నరాల బలహీనత, ఇత్యాదుల నుండి కూడా కాపాడుకోవాలి. తక్కువ వయసులోనే ముడతలు పడి  ముసలితనం వచ్చేటట్లు చేస్తాయి. కాబట్టి అవసరమైతే మాయిశ్చరై జర్ ను వాడాలి.

చలి నుండి, ఎండ నుంచి మేకప్ ఉపకరిస్తుంది. ఉప్పు నీరు చర్మాన్ని పొడిగా చేస్తుంది. కాబట్టి బావి నీరు కన్నా పంపు నీరు వాడితే చాలా మంచిది . విడవకుండా మేకప్ వేసుకుంటే ముఖము పాడవుతుంది. క్లీనింగ్ పేస్ మాస్క్ ని కనీసము వారమునకు ఒకసారి పెట్టుకోవాలి. అది చర్మమును తాజాగా ఉంచుతుంది.

మేకప్-జాగ్రత్తలు


మేకప్ వేసుకోవడానికి ముందు ప్రతి వారు గమనించి, తీసికోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే......ముఖంలో జిడ్డు, మురికి, చెమట లేకుండా క్లీన్ చేసుకోండి. పొక్కులు, పుండ్లు లేకుండా చూసుకోవాలి. ఉదయము మేకప్ వేయా లంటే  రాత్రికే పేస్ ను క్లేఆన్ చేసుకోవాలి. సబ్బు నీటితో ముఖాన్ని కడుగు కోవాలి. 


ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!

Share:

Labels

Blog Archive