పుదీనా
పుదీనా చిన్న మొక్క. వ్రుక్ష శాస్త్రవేత్తలు దీనిని తులసి కుటుంబంలోనిదిగాచేర్చారు. పుదీనా చాల సున్నితమైన ఆకుకూర . శీతాకాలంలో ఇది బాగా పైరు అవుతుంది. పుదీనా ఆకు ఆరోగ్యకరమైంది. ఇది కొంచెం ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. పుదీనా పచ్చడిగ ఉపయోగిస్తారు.ఇతర కూరలకు సువాసన అందచేస్తుంది.
పుదీనా ఆకును
సంస్కృతంలో “శాకశోభన” అని పిలుస్తారు. నోటి అరుచిని పోవడానికి పుదీనా ఆకులతో,
ఖర్జూరం కాయలు, మిరియాలు, సైంధవ లవణం, ద్రాక్ష మొదలైనవి కలిపి పట్చాడిని చేసి
నిమ్మకాయను పిండి ఉపయోగిస్తారు.
గుండెకు పుదీనా చాల
పధ్యకరమైంది. కలరా రోగాలలో ఇది గుణకారి. ఎక్కిళ్ళు, వమనాలు మొదలైన రోగాలకు ఇది
ఉపకరిస్తుంది. పుదీనా ఆకు రసం తేనెతో కలిపి చెవిలో వేస్తే చెవి పోటు తగ్గుతుంది.
కనతలకు రాసు కుంటే తలనొప్పి నయమౌతుంది. పుండ్లపైన రాస్తే అవి చప్పున తగ్గుతాయి.
అమృతాంజనం వంటి
మందులలో అధికంగా పుదీనా ఆకులు వేస్తారు. అజీర్ణతకు ఇది నిత్యం సేవించడం మంచిది.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి