సీకాయ(Acacia Concinna)
సీకాయ తీగ జాతిలోని చెట్టు. సీకాయఆకు, చిగురు కొంచెం పుల్లగా ఉంటాయి. సాయంకాలం ఈ ఆకులు ముచ్చ ముడుచుకుంటాయి. ఆకు, చిగురు కుడా పచ్చడ్లలో ఉపయోగిస్తారు.
సీకాయఆకు లేక
చిగురు విరేచానాన్ని ఇస్తుంది. శ్లేష్మాన్ని
హరిస్తుంది. పాండు రోగాలని హరిస్తుంది. పాండు రోగాల్ని, పిట్ట వ్యాదుల్ని
తగ్గిస్తుంది.
జ్వర రోగులు పథ్యం
పుచ్చుకునే సందర్భంలో సీకాయ చిగురు పచ్చడిని పలువురు ఆయుర్వేద వైద్యులు సలహా
ఇస్తున్నారు.
చింతపండు పులుపు
నిషిద్దమైన అన్ని రోగాలలో సీకాయ చిగురు పులుపును నిరభ్యంతరముగా ఉపయోగించవచ్చు అని
ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
ఈ ఆకుల కాషాయం
మలేరియా జ్వరంలో మిక్కిలి గుణకారిగా ఉంటుంది.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి