అవిసె ఆకు కూర మరియు దాని ప్రయోజనాలు

అవిసెను అగిసి అని కూడా పిలుస్తారు. ఇది ఒక చెట్టు. ఈ చెట్టు 20 నుండి 30 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనికి ఎరుపు రంగు పూలు తెలుపు రంగు పూలు పూస్తాయి. ఈ చెట్లు సన్నగా ఎదగడం మూలాన వీటిని తమలపాకు తీగల సాగులో వాడుతారు.




సామెత : అవిసె ఆకు తిన్నవాడు అరచి చచ్చును అని నెల్లూరు జిల్లా లో వాడుకలో ఉండేది. అవిసె ఆకు బాగా వేడి చేసే గుణం కలిగి ఉంటది. నీరసాన్ని సమూలంగా తొలగిస్తుంది

అవిసె ఆకులు నూరి ముద్దగా చేసి చర్మం మీద పట్టుగా కూడా ఉపయోగిస్తారు. గాయాలకు, దెబ్బలకు ఒక మంచి ఔషదం లాగ పనికొస్తుంది.

అవిసె ఆకుల స్వరాసాన్ని కొన్ని చుక్కలు ముక్కోలో వేసుకోవడం వలన రొంప భారము, తల నొప్పి తగ్గిపోతాయి. ఇలా చేసినందువల్ల ముక్కు నుండి జలుబు నీరు బాగా కారి తల నొప్పి తగ్గిపోతుంది. చిన్న పిల్లలకు ఈ ఆకు రసం లో కొద్దిగా తేనె కూడా కలిపి వాడటం మంచిది.

నులి పురుగుల్ని అంతం చేస్తుంది.
అవిసె ఆకులు చేదుగా, కారంగా ఉంటాయి. కడుపు లోపల ఉన్న నులి పురుగుల్ని అంతమోదించడం లో ఈ ఆకులు చక్కగా పని చేస్తాయి. సాలె పురుగుల విషం నుండి కూడా ఉపసమనం కలిగిస్తాయి అని కూడా చెప్తుంటారు.

గావద బిల్లలకు కూడా అవిసె ఆకుల రసం పూస్తే అవి కరిగిపోతాయి.

రేచీకటి ఉన్నవారు కూడా ఈ అవిసె ఆకులను కర్ర రోటిలో కర్ర బండ తో మెత్తగా దంచి కుండలో ఉంచి ఉడకబెట్టి రసం తీసి, ఆ రసాన్ని తులమెత్తు సేవిస్తే రేచీకటి తగ్గుతుంది.

అవిసె ఆకు రక్త పైత్యాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకు తినటానికి మధురంగా ఉంటుంది.  అప్పుడప్పుడు అవిసె ఆకులను కూరకు ఉపయోగించడం చాల మంచిది. తెలుగు వారికంటే తమిళిలు ఈ ఆకును ఎక్కువగా ఉపయోగిస్తారు. వారు తినడమే కాకుండా ఈ కూరన విరివి గా ఆవులకు కూడా పెడతారు.



ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.

ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!
Share:

No comments:

Post a Comment

Labels

Blog Archive