గంగ పావిలి ఆకు కూర (Portulaca Oleracea) - రక్త హీనత వ్యాధికి ఇది పెట్టింది పేరు

గంగ పావిలి ఆకు కూరని గంగ పాయ, గోళీ కూర అని కూడా అంటారు.  ఇందులో సన్న పాయల, పుల్ల పాయల, పెద్ద పావిలి, బొడ్డు పాయల అని నాలుగు రకాలు.  దీనిని సంస్కృతం లో ఘొటిక. లోనిక అని పేర్లు.  




గంగ పావిలి కూర ఎర్రని కాడలతో ఎర్ర గల్జేరు ను పోలి ఉంది, నెల మీద పాకుతుంది. కాడలు ఆకులు కూడా దళసరిగా ఉంటాయి.  పసుపు పచ్చ పూలు పూస్తాయి.  గంగ పావిలి కూర పుల్లగా ఉంటుంది.  ఇది సులభంగా పెరుగుతుంది.  సన్నగా తరిగిన ఆకులని, కాదలని నానబెట్టిన పచ్చి పెసర పప్పుతో ను, కొబ్బరి తురుము తోను తినవచ్చు. రుచికి కొద్దిగా ఉప్పు చేర్చుకోవచ్చు.  పాశ్చాత్య దేశాల్లో ఈ ఆకు ని విరివిగా వాడుతారు.

ఇందులో ఏ, బీ విటమిన్లు ఉన్నాయి. పాల కంటే, వెన్న కంటే కూడా ఎక్కువ జీవ శక్తి ని ఇస్తుంది.  దీనిని పచ్చి కూర గానే వాడటం చాల మంచిది.  ఇది దంతాలకు, ఎముకలకు పుష్టి నిస్తుంది.  రక్తం లోని  పులుపు ని విరిచి రక్త శుద్ధి చేసే గుణం ఉంది.  తల వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.  దీనిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంది.

రక్త హీనత వ్యాధికి ఇది పెట్టింది పేరు. శరీరం లోని చేదు పదార్ధాలను తొలగిస్తుంది.  క్షారశిల అను మూల పదార్ధము ఈ కూర ద్వారా మనకు అందుతుంది. 

ఎముకలు, నోటి పండ్లు పెరుగుటకు క్షారశిల ముఖ్య మైన మూల పదార్దాము. గంగ పాయిల ఆకు కూర తో పులుసు, కూర చేసుకోవచ్చు.


ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.


Share:

Labels

Blog Archive