మునగ ఆకు
మునగను ములగ అని కుడా అంటారు. శిగ్రు, శోభాంజన,కృష్ణగంధ,బహు లచ్చద అని సంస్కృతం లో పిలుస్తారు.
ములగాకు చాల
బలకరమైంది. దానిలో 5,౦౦౦ యూనిట్ల అ విటమిన్ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇది
మలాన్ని గట్టి పరుస్తుంది. అగ్ని దీపనాన్ని చేస్తుంది. కఫాన్ని, వాతాన్ని
హరిస్తుంది. మిక్కిలి కాక చేస్తుంది. రక్త పిత్తాన్ని కలిగిస్తుంది. విద్రధిని,
ప్లీహ వ్రానాన్ని పోగొడుతుంది. ఇది బహు పత్యకరి.
శరీరం లోని చేదు
నీటిని బయటకు పంపడానికి ఇది పెట్టింది పేరు. ఇది దృష్టిమాంద్యాన్ని పోగొడుతుంది. స్రీలకు
ఇది చాల మంచిది. ‘ముట్టునీళ్ళ
నాడు మునగాకు కూర’ అని సామెత.
అంటే ఇది ముట్టునీళ్ళ నాడు మునగాకు తినడం పత్యకరమై ఉందని అర్ధం.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి