చిలుక కూర

చిలుక కూర

నదుల గట్టులు, చెరువు గట్టులు మొదలైన తేమ గల ప్రదేశాలలో ఈ కూర పెరుగుతుంది.  సరస్వతి ఆకును పోలి ఉండటం చేత జల ప్రాంతాల్లో ఉండటం వల్ల దీనిని జల బ్రహ్మి అని అంటారు.  ఇది రెండు రకాలు
1. పెద్ద చిలుక కూర
2. తెల్ల చిలుక కూర

పెద్ద చిలుక కూరను బలప్రరోహిత, ఛిల్లీ, ఛిల్లిక, చిలిక, మృదు పత్రీ, క్షీర బలి, క్షీర పత్ర, వాస్తుకి అని సంస్కృతం లో పిలుస్తారు. 

తెల్ల చిలుక కూరని సుబల్య, వాస్తుకీని, శ్వేత ఛిల్లీ, శ్వేతఛిల్లిక  అని సంస్కృతం లో అంటారు.  ఇవి సర్వఔషది గుణ కల్పకాలు. 

పెద్ద చిలుక కూర వేగం కలదై లఘువు గా, శీతలంగా, రుచిగా ఉంటుంది.  బుద్ధిని బలాన్ని ఇస్తుంది.  అగ్ని దీపనాన్ని కలిగిస్తుంది.   ప్లీహం, రక్తదోషం, త్రిదోశాలను, క్రిములను హరిస్తుంది. 

తెల్ల చిలుక కూర తీయగా ఉంటుంది.  పిత్తాన్ని, జ్వర దోషాల్ని, త్రి దోషాలని హరిస్తుంది.  పధ్యకరమై ఉంటుంది.  ఈ ఆకు చేదు గ ఉండి, ఉష్ణ వీర్యమైంది. విరేచనా కారి.  కడుపులో పురుగుల్ని హరిస్తుంది. కుష్టు రోగాన్ని పోకారుస్తుంది.  ఉత్సహాన్ని ఇస్తుంది, పుష్టి, తుష్టి ఇచ్చే కూర.  మూల వ్యాదులలో, గ్రహణి రోగాలలో, ఉబ్బు రోగాలలో, కడుపులోని రోగాలకు ఇది మంచిది.  చిలుక కూర రసం సురవియ్య పొడి కలిపి శరీరానికి రాసుకొని స్నానం చేస్తే, శరీర దుర్గంధం తొలగిపోతుంది. 


ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.


Share:

Labels

Blog Archive