కామంచి ఆకు కూర - కుష్టు ని సైతం నివారిస్తుంది.


కామంచి ఆకు కూర

దీనిని కాచాకు అని కూడా అంటారు. కాసార,కాసార కూసర , గాజు అని కూడా పిలుస్తారు.  దీని ఆకులు నూరిన ముద్ద కీళ్ళ నొప్పుల్లకు పట్టుగా ఉపయోగిస్తారు. ఈ ముద్దతో నలుగు పెట్టుకుంటే చర్మ రోగాలు నిమ్మళీస్తాయి.

కామంచి ఆకుల నిజరసం, జలోదరం, హృదయ వ్యాధి, చర్మ రోగాలు, మూలశంఖ, సెగ రోగము. యకృత్ ప్లీహ వ్యాధులు, మండెడు బొబ్బలు మున్నగు జబ్బులలో లోనికి సేవిన్చడము మంచిది. మోతాదు  అర  డ్ర్రాము (1/8 ఔన్సు )  మొదలు రెండు డ్రాముల వరకు.

కాచాకు రసంతో తయారు చేసిన షర్బత్తు జ్వరాలలో  తాగనిస్తే తాపం ఉపసమించడమే  కాకుండా బాగా చెమట పడుతుంది.

ఎక్కడనైన వాచి బాధగా ఉన్నప్పుడు ఈ ఆకులూ  వెచ్చ చేసి వేస్తె గునకరిగా ఉంటుంది. ఉబ్బు వ్యాధులు కల వారికి కామంచి ఆకులు కూర  మంచిది. ఎలుక కాటుకు విరుగుడుగా  కామంచి ఆకు స్వరాసాన్ని పైన పూస్తారు. కామంచి ఆకు చెవిలో పిండితే చెవి పోటు తగ్గి చీము ఉంటె చీము కట్టు తుంది.

కామంచి ఆకు కుర బాగా ఆకలి కలిగిస్తుంది. మేహతత్త్వం వారికి మేలు చేసే తల్లి. త్రిదోషాలను హరిస్తుంది.  కుష్టు రోగాన్ని పోగొడుతుంది. ఈ కూర కారంగా, చేదుగా ఉంటుంది. దీనిని అరవవారు విశేషంగా ఉపయోగిస్తారు.



ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.


Share:

Labels

Blog Archive