తుమ్మి

తుమ్మి ఆకు

తుమ్మి ఆకులకి ఒక విధమైన సువాసన కలిగి ఉంటుంది. అగ్ని మాంద్యాన్ని పోగొట్టే రుచికరమైన కూర. దీని ఆకులతో పులుసు కాచుకుంటారు. ఇది వాత కఫాలని హరిస్తుంది.

తుమ్మి ఆకుల రసంలో కొద్దిగా ఉప్పుని కలిపి శరీరము నందు రాస్తే చిడుం తగ్గుతుంది. ఇది ఆడవారి ముత్తు నొప్పులకి మంచి మందు.
తుమ్మి ఆకునకు సమభాగం మిరియాలు చేర్చి కుంకుడు కాయంత మాత్రలు స్రీలు బయట ఉన్న మూడు రోజులు రెండు పూటల  తీసుకోవాలి. అన్నం, పాలు మాత్రం పత్యముగా ఉంటె ముత్తు నొప్పులు తగ్గుతాయి.

కడుపులోని పురుగుల్ని ఇది నాశనం చేస్తుంది. మూల రోగాల్లో, విశాదోశాలలో, గ్రహణి రోగాలలో తుమ్మి ఆకుకూర పథ్యంగా ఉంటుంది.


ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.


Share:

Labels

Blog Archive