చింతాకు

చింతాకు

కూరగాను పచ్చడి గాను లేత చింతాకుని వాడుతారు.  దీనిని చింత చిగురు అంటారు.  ఇది సర్వఔషది గుణకల్పకం. చింత చిగురు హృదయానికి మంచి చేస్తుంది.  వగరు, పులుపు రసాలని కలిగి ఉంటది. బుద్ది కి మేలు చేస్తుంది.  కఫ వాతలని జయిస్తుంది.  చింత చిగురు వేసవి కాలం లో దొరుకుతుంది. 





చింత చిగురు కొంత వేడి చేస్తుందని చెబుతారు, కాని దీనిని తినడం వల్ల చెమట బాగా పట్టి వేసవి కాలం లో మేలు చేస్తుంది.  వాత వ్యాధులని, మూల రోగాలని, గుల్మాన్ని తగ్గిస్తుంది.  పైత్య వికరాలని తగ్గించే చింత చిగురు ఆకు మంచిది.  నేత్ర వ్యాధులు కల వారు దీనిని వాడకూడదు. 

చింతకులో వాపాలను హరించే గుణం ఉంది.  చింతాకును మెత్తగా నాలాగా గొట్టి నేతి తో నో, ఆముదం తోనో వెచ్చ చేసి కాపడం ఇస్తే వాపులు తగ్గిపోతాయి. మోకాళ్ళు వాచినప్పుడు చింతాకును ముద్దగా నూరి పట్టు వేస్తే మంచిది. చింతాకు రసం లో పసుపు కలుపుకొని తాగితే మసూచిక వ్యాధి నివారణ అవుతుంది.



ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.


Share:

Labels

Blog Archive