బెండ కాయ

బెండ కాయ

బెండ కాయలో నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఇది చలువను చేస్తుంది.  ఇందులో ప్రోటీన్లు, కార్బో హైడ్రేట్లు మెండుగా ఉంటాయి.  విటమిన్ C, K, థయామయిన్, మెగ్నీషియం  ఉన్నాయి. 



బెండకాయలను కూరగా వండుకోవడమే కాకుండా, పచ్చిగా కూడా తిన వచ్చు.  బెండకాయ విత్తనాల నుండి నునే ను కూడా తీస్తారు. ఇది మధురంగా కూడా ఉంటుంది.  సన్ ఫ్లవర్ ఆయిల్ ను వాడినట్టే దీనిని కూడా వాడుతారు.

ఔషదంగా గుణాలు : 
1.    బెండకాయ ను ముక్కలుగా కోసి రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి.  బెండకాయ లో ఉన్న ఔషద గునాల్లన్ని నాన బెట్టడం వల్ల ఆ నీళ్ళలో ప్రవేస్తాయి.  ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని సేవిస్తే Type1 మరియు Type 2 డయాబెటిస్ తగ్గుతుంది.  బెండకాయ ముక్కలనే కాకుండా సన్నగా తరిగి కూడా నీళ్ళలో నానబెట్టుకోవచ్చు. ఇలా సన్నగా తరిగి నానబెట్టిన నీరు చేదుగా ఉంటుంది.
a.     గమనిక: ఒక వేళ మీరు గనుక డయాబెటిస్ కు చికిత్స తీసుకుంటున్న యెడల, డాక్టర్ గారి సలహా తప్పకుండ తీసుకోండి.
2.    బెండకాయను పచ్చిగా తినడం వల్ల కూడా లాభాలు ఉన్నాయి.  ఇందులోని జిగురు పదార్ధము కీళ్ళ నొప్పులనుండి ఉపసమనాన్ని కలిగిస్తుంది.  ఆడ వారిలో తెలుపు బట్టని అరికట్టడంలో ఉపకరిస్తుంది. 
3.    ఇందులో ఫైబర్ ఎక్కువ పాళ్ళలో ఉండడం వల్ల ఊబకాయ్యాన్ని తగ్గించడం లో సహకరిస్తుంది. శ్వాస కొస వ్యాదులకి కూడా దీని వాడుక మంచిది.
4.    బెండకాయ వాడుక వల్ల చెడు కొలెస్స్త్రోల్ తగ్గి మంచి కొలెస్స్త్రోల్ ని పెంపొందింపబడుతుంది
5.    స్ట్రెస్ ని కూడా అరికడుతుంది.


ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రయిబ్   చేయండి .

ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!

Share:

Labels

Blog Archive