పొన్నగంటి (Alternanthera triandra)

పొన్నగంటి ఆకు 

ఈ కూర నేత్ర వ్యాదులలో మిక్కిలి పత్యకారిగా ఉంటుంది.  పొన్నగంటి మలాన్ని గట్టి పరుస్తుంది. శీతలంగా ఉంటుంది. కుష్టు, పిత్తం, కఫం, రక్తదోషం,మేహం,విషం,పండువు,శ్వాసం,కాసం,జ్వరం, వాపు, దురద, ప్లీహరూగం,వాటం,శోష,వాంతి, అరుచి వీనిని పోగొడుతుంది. హృదయానికి మేలు చేస్తుంది. 




పొన్నగంటి సుఖకరమైన శాకల్లో ఒకటి. ఇది చలువ చేస్తుంది.జ్వర తాపాన్ని, విదాహాన్ని తగ్గిస్తుంది. నేత్రరోగాలకి, శిరో రోగాలకి ఆయుర్వేద వైద్యులు  భ్రుంగామలిక తైలం లో పొన్నగంటి కూర రసం కుడా వేస్తారు.

ఆవు నేతిలో ఉడికించి పొనగంటి ఆకును కండ్లకు కడితే వేడి వల్ల కలిగే నేత్ర వ్యాధులు నయం అవుతాయి.వేడి వల్ల కలిగే తల పోట్లల్లో ఆకు తలకు కట్టడం మంచిది. పొన్నగంటి ఆకు రసం గాని, ఆకు నూరిన ముద్దా కాని గాయం ఫై కడితే గాయాలు మానుతాయి. మూలరోగాలను కుడా తగ్గిస్తుంది. రక్త దోషాన్ని, కుష్టువ్యాదిని పోకారుస్తుంది.


కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ ఆకుల్ని ఎండ బెట్టి వరుగు చేసి నిలవ ఉంచి వాడుకునే పద్దతి కుడా ఉంది.పొన్నగంటి కూర లో ఇంకో రకం కుడా ఉంది. దానిని సీమపొంనగంటి అని అంటారు. సీమ పొన్నగంటి కి కుడా దేసవాలి పొన్నగంటి లక్షణాలే ఉన్నాయి. 

Share:

Labels

Blog Archive