తమలపాకు

తమలపాకు

భరత ఖండంలో తమలపాకు వాడకం అత్యంత ప్రాచీనమైనది. తమలపాకులని మనం కూర చేసుకోము. పట్చివిగానే తింటాము. తినే ఆకులు కలగడం వల్ల దీనిని భక్ష్యపత్రి అని అంటారు. దీనిని తాంబూలవల్లి, తాంబూలి, నాగిని, నాగ వల్లరి అనేవి సంస్కృతం నామాలు.





తమలపాకులని సున్నం రాసి వక్కతో కలిపి తాంబూలంగ సేవిస్తాము. తమలపాకు తోట ఒకే చోట రెండేళ్ళ మొదలు ఐదేళ్ళ వరకు వర్ధిల్లుతోంది. నీడ కొరకు అవిస చెట్లు గాని, అరటి చెట్లు గని పెంచుతారు. ఈ చెట్లే తమలపాకు తీగె పాకడానికి ఉపకరిస్తాయి.

తమలపాకులు శోధనం చేస్తాయి. రుచిని కలిగిస్తాయి.  త్వరగా కాక చేస్తుంది. వగరుగా, చేదుగా, కొంచెం ఉప్పగా ఉంటాయి. శరీరం లో వ్యాపించే గుణాన్ని కలిగి ఉంటాయి. శ్లేష్మం, నూతి కంపుని, బడలికని పోగొడతాయి. 

తమలపాకులు వేడి చేసే స్వభావాన్ని కల్గి ఉంటుంది. వాత కఫాలని హరిస్తాయి. కంఠ స్వరాన్ని బాగు చేస్తాయి. బాలింతలకు కూడా పత్యకరమైంది.

ఇది సుగుణాలు  కలిగి ఉన్న్నప్పటికి ని తాంబూలాన్ని ఎక్కువగా సేవిస్తే దంత వ్యాధులు కలుగుతాయి. మితి మీరి తింటే నాలుక మొద్దు బారి పదార్థాల రుచించవు.

భోజనాంతరం గడియ సేపు తాళి మరీ తాంబూలం వేసుకోవాలి. స్నానంచేసిన వెంటనే, డోకు వెళ్ళిన వెంటనే, నిద్ర లేచిన వెంటనే తాంబూలం వేసు కోకూడదు. తమలపాకుల నడిమి ఈనె వంద్యత్వాన్ని  కలిగిస్తుందని చెబుతారు.  భోగపు స్రీలు మాత్రం ఈ ఇనేల్ని సేవిస్తారు.  దానివల్ల వారిలో సంతనవతులు చాలఆగనే ఉంటారు.

తమలపాకులు కిల్లి  దుకాణంలో నడిమ ఈనేలని తీయకుండానే ఉపయోగిస్తారు. ఇది ఎంతయినా మంచిది కాదు.  తమలపాకులు వేసుకోవడం వల్ల వచ్చు తిక్కకు చల్లని నీళ్ళు త్రాగడం చాల మంచిది. లేదా నీళ్ళతో పుక్కిలించి నూట్లో పుల్లని వస్తువు గాని, తియ్యని వస్తువుకాని చప్పరించాలి.

ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.


Share:

Labels

Blog Archive