ఉస్తి ఆకు ( Solanum Trilobatum)

ఈ ఆకుని ఉచ్చింత ఆకు అని కూడా పిలుస్తారు.

ఈ ఆకుని ఎవరు కూడా ప్రత్యేకంగా పెంచరు. ఇది డొంకల్లో స్వభావ సిద్ధంగా పొదగా అల్లుకొని పెరుగుతుంది. ఉస్తి ఆకుల మీద మరియు కాయల మీద ముండ్లు ఉంటాయి.  ఉస్తి కూర మిక్కిలి పధ్యకరమైంది .  


ఈ ఆకుకూరను బాలింతలకు కూడా పెడతారు. గర్భ వాతాన్ని హరించి పూరిటాళ్ళకు ఇది బాగా మేలు చేస్తుంది. ఉస్తి ఆకులు శ్లేష్మ వాతాన్ని తగ్గించడంలో పెరు మోసింది.  ఈ కూర చాల చేదుగా ఉంటుంది.  ఉస్తి ఆకు నులిపురుగులను చంపుతుంది. అరుచిని పోగొట్టుతుంది. బుద్ధికి బలాన్ని కలిగిస్తుంది. ఎక్కిళ్ళను పోకారుస్తుంది.  






ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.

ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!
Share:

Labels

Blog Archive