బచ్చలి ఆకు కూర (Basella alba, Basella Lucida, Basella rubra)

బచ్చలి ఆకు కూర 

బచ్చలి సర్వ సాధారణమైన పాత్ర శాకం. మొక్కగా పెరిగే మత్తు బచ్చలి ఒక రకం. తీగలుగా ప్రాకే రకం ఒకటి. దీనిని తీగ బచ్చలి అని అంటారు. ఎర్ర బచ్చలి, పాల బచ్చలి, పెద్ద బచ్చలి, కారు బచ్చలి, పుల్ల బచ్చలి, అని ఇతర రకాలు.పుల్ల బచ్చలినె చుక్కకూర అంటారు.ఎర్ర బచ్చలినే రాచ బచ్చలి అని అంటారు.న్యూజీలాండ్లో  ఒక రకపు బచ్చలి ఉంది.




మట్టు బచ్చలికి ఉపోదకి అని, తీగ బచ్చలికి పల్యుపోదకి అని సంస్కృతంలో పిలుస్తారు. తీగ బచ్చలి కూసిన కొద్ది పెరుగు తుంది. ఈ జాతి బచ్చలులన్ని చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి.

మట్టు  బచ్చలి ఏక వార్షిక పంట. విత్తులు చల్లితేనే కాని విత్తులు మొలకెత్తుతాయి.  మట్టు బచ్చలి వాగ్దోషాలను పోగొడుతుంది. మూల వ్యాదుల్ని నయం చేస్తుంది. బచ్చలి శాకలన్ని కొంచెం గురుత్వం చేసి నిద్రను పుట్టిస్తాయి.బచ్చలి కూర లో రక్తహీనతను తగ్గించే గొప్ప గుణం ఉంది. కంద దుంపలతో  కలిపి వండితే దీని దోషాలు తొలగిపోతాయని చెబుతారు.

బచ్చలిలో కారోటిన్ అనేది హెచ్చుగా ఉంది. ఇందులో c విటమిన్ ఎక్కువ పాళల్లో లభిస్తుంది. బచ్చలి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. బచ్చలిలో ఇనుము,ఖనిజ లవణాలు మెండుగా ఉన్నవి. బచ్చలిలో భాస్వరం, కాల్షియమ్ కొద్దిగా ఉన్నాయి.

బచ్చలి ఆకు పసరు కాలిన చోట ఫై పూటకు ఉపయోగిస్తే మంట తగ్గి పుండు త్వరగా మానుతుంది.కలిగిన కండ్లను ఒత్తడానికి బచ్చలి ఆకులు వాడుతారు.మజ్జిగతో కాచే బచ్చలి పులుసు రక్తం ఎక్కువగా పడే మూలవ్యాధులలో గునకారిగా ఉంటుంది.
 బచ్చలి రసం పాలల్లో కలిపి తీసుకుంటే  పగలంతా కష్టపడి పని చేసి అలసి ఉన్నవారికి  గుణకారిగా ఉంటుంది. మూత్రపిండం బాగా పని చేయకుండా ఉన్న వారికి బచ్చలి రసంలో ఒక చెంచాడు నీరుల్లి రసాన్ని కలుపుకొని త్రాగితే మేలు చేస్తుంది.



ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి 

Share:

Labels

Blog Archive