మెంతి కూర (Trigonella foenum graecum)

మెంతి కూర 

నల్ల నేలలో శీతల కాలంలో ఫైరు చేయబడే మెంతి కూర చాల రుచిగా ఉంటుంది. మెంతి కూర పచ్చిగా గాని, ఎండబెట్టి గాని ఉపయోగిస్తారు. పచ్చి మెంతికూర తో ఏ వంటకాలు చేస్తామో అవి యందు మెంతి కూరతో కుడా చెయ్య వచ్చు. ఇది చిరుచేదుగా ఉంటుంది.
మెంతి కూర కారంగా, ఉష్ణంగా, రస కాలమందు చేదుగా, లఘువుగా ఉంటుంది. యందు మెంతి కూరను చారు లో వేస్తారు. జ్వరం, వాంతి, వాత రక్తం, కఫం, దగ్గు, వాయువు, అరస, క్రిమి, క్షయ, శుక్రం నశింప చేస్తుంది. మెంతి కూర అరోచాకాన్ని పోగొడుతుంది. మెంతి కూరలో మెహ శాంతిని ఇచ్చే మంచి గుణం ఉంది కాని త్వరగా జీర్ణం కాదు.


ఇది ఎటువంటి మూత్రరోగాలకైన మంచి గుణకారి మెంతి ఆకులని . వెన్నెలో ఉడికించి గాని, వేయించి గాని ఇస్తే పైత్య వికారం తగ్గుతుంది. మెంతి  ఆకులని నూరి ముద్దగా చేసి కాలిపుండ్లకు, వాపులకు పట్టు వేస్తే చల్లగా ఉంది మేలు చేస్తుంది.

మెంతి కూర ఆకులను నూరి ముద్దా కడితే వెంట్రుకలు మృదువుగా అవుతాయి. వెంట్రుకలు రాలే జబ్బు తగ్గుతుంది.

మెంతి కూర స్రీలకు చాల హితమైంది. శ్రీల గర్భాశయం బాగు చేయడంలో, ఋతుక్రమం సుష్టు చేయడంలో ఇది బాగా పని చేస్తుంది.
మెంతి ఆకుల వల్ల కలిగే దోషాలని పులుసు వస్తువులు పోగోడుతాయి.



ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి 

Share:

Labels

Blog Archive