తోటకూర (Amaranthus Oleracens)

తోట కూర

మేహాన్ని తగ్గించి సమ శీతోష్ణ స్థితిలో నిలిపి ఉంచే గుణం తోటకూరకు అగ్గలంగా ఉంది. అందుచేత తోటకూరను మహా శాక అని అన్నారు. మహాశాకం కావడమే కాకుండా ఇది పవిత్ర శాకం .  





తోటకూరను ఏడాది పొడవునా పెంచుకోవచ్చు. కాడకట్టిన  మొక్కల కాడలు కూరకి, పులుసుకి పనికి వస్తాయి. తోటకూరలో పెరుగు తోటకూర, కొయ్య తోటకూర, చిలుక తోటకూర, ముళ్ళ తోటకూర  అనే రకాలు ఉన్నాయి.
జీవంతక, శాకవీర, రక్తనాళ, ప్రణాళిక అనేవి సంస్కృత నామాలు. రక్తరూప శాకిని అనేది ఎర్ర  తోటకూర సంస్కృత నామం.

కొయ్య తోటకూర బాగా వేడి చేస్తుంది. కాబట్టి బాలింతలకు, నంజువ్యాది గల వారికి విరివిగా వాడతారు. వాత తత్వం వారికి మేలు చేస్తుంది. ఉష్ణ తత్వం ఉన్న వారికి ఇది గుండె నొప్పి, పిత్త వికారం కలిగిస్తుంది. ముళ్ళ తోటకూరను పప్పుకూర గా వండి పెడితే బాలింతలకు పాలు పడతాయి.

ముళ్ళ తోటకూర బూడిదను బట్టలు ఉతకడంలో వాడుతారు.ఇందులో క్షార పదార్ధం విస్తరించి ఉంది తెల్లదనాన్ని ఇస్తుంది. మలబద్దకాన్ని తొలగించడంలో తోటకూర సాటి లేనిది.


ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.


Share:

Labels

Blog Archive