గుంట గలగర ఆకు - కేశ వర్ధిని


కేశ రంజన,  కేశ  ప్రభాకర, భ్రుంగరాజ, మహా నీల, కేశ రాజ మొదలైనవి దీని సంస్కృత  నామాలు.  తేమ గల ప్రదేశాలలో, మెత్త ప్రదేశాలలో ఇది బాగా పెరుగుతుంది.  వర్షాధ్యికం గల మలబారు మండలాల్లో గోగు మొక్క అంత ఏపుగా పెరుగుతుంది.





గుంట గలగర ఆకు పువ్వును బట్టి మూడు రకాలు గా విభజింపబడింది. తెల్ల, పచ్చ, నల్ల పువ్వుల జాతులు.  తెల్ల పువ్వుల ఆకు కూర అంతటా దొరుకుతుంది.  నల్ల పువ్వులది వంగ రాష్త్ర ప్రాంతాల్లో ఉంటుంది. పసుపు పువ్వులు ఎక్కువగా వాడుకలో ఉంది. 

గుంట గలగర ఆకు సర్వఔషది గుణ కల్పకము.  ఇది కారంగా, చేదుగా ఉంటుంది.  తాపాన్ని, వేడిని కలిగిస్తుంది.  కఫ వాతాలని పోగొడుతుంది.  దంతాలు, చర్మం కి హితముగా ఉంటుంది.  ఆయువుని, ఆర్యోగ్యాన్ని పెంచుతుంది. 

కుష్టు, నేత్ర రోగం, శీరో రోగం, వాపు, దురద, ఆంత్రవృద్ధి, శ్వాసం, కాసం, క్రిములు, ఆమ రోగం, పాండువు, హృద్రోగం, చర్మ రోగం, మదం వీటిని హరిస్తుంది.

ఆకుకూరలలో పొన్న గంటి తరువాత ఈ ఆకుకి నేత్రాలని మేలు చేసేదిగా చెప్పుకోవచ్చు.  తల చముర్లుగా ప్రసిద్ధికి ఎక్కినా భ్రుంగామలక, భ్రుంగ రాజ తైలాల్లో ఇది ప్రధానమైనది.  నేత్రాలకు చలువ చేస్తుంది.  ఆకు పసరు తో తాయారు చేయబడ్డ కాటుక పెట్టుకోవడం వల్ల కంటి వ్యాధులు నయం అవుతాయి. 

కేశ వృద్ధిని, మేధా వృద్ధిని కలిగిస్తూ రసాయనం గా పని చేస్తుంది.  కేశాలని నల్ల బరిచి వెంట్రుకలని పెంచుతుంది.  గుంట గలగర ఆకు రసం ఆముదం తో కలిపి రాస్తే నలుపెక్కుతాయి.  కొబ్బరి నునే తో కాని, నువ్వుల నునే తో గాని ఈ రసం పోసి, నునే కాచి ఉపయోగిస్తే తల నెరవడం తగ్గి వెంట్రుకలు నల్లగా, నున్నగా తయారు అవుతాయి.

ఈ ఆకు రసాన్ని నశ్యంగా కూడా వాడతారు.  పురిటి పిల్లలకి  ఆకుల స్వరసం మూడు నాలుగు చుక్కలు తేనే తో కలిపి కొన్ని ప్రాంతాల్లో పట్టిస్తారు.

యక్రుత్, కామెల, సవాయి మున్నగు రోగాలకు ఇది గునకారి.  గుంట గలగర రసం ఒకటిన్నర డ్రాము (1/8 ఔన్సు) మోతాదుగా మజ్జిగతో  గాని నీళ్ళతో  గాని తీసుకుంటే పాము కాటు నయం అవుతుందని  చెబుతారు.  8 చుక్కల తేనే లో రెండు చుక్కల గుంట గలగర ఆకు నిజరాసాన్ని వేసి పురిటి పిల్లలకి అందిస్తే జలుబు తగ్గుతుంది.  కడుపులో పాములు ఉన్నాయి అని అనుమానంగా ఉంటె ఈ ఆకు పసరుని ఆముదంతో కలిపి తీసుకోవడం మంచిది.  చెవి పాటుగా ఉన్నప్పుడు ఈ ఆకు పసరు రెండు చుక్కలు పోస్తారు.

ఈ ఆకులు నూరి ముద్ద చేసి తేలు కుట్టిన చోట పట్టు వేస్తే విషం విరుగుతుందని చెబుతారు. చర్మ రోగాలలో ఈ పట్టు బాగా పనిచేస్తుంది. 

గుంట గలగర ఆకుల పొగ గాని, ఆకులు వేసి కాచిన నీటిని ఆవిరి పట్టిస్తే మూల శంక రోగం తగ్గుతుంది.  కుష్టు, బొల్లి రోగాన్ని తగ్గిస్తుంది.  దీనిని తరచుగా కూరగా పచ్చడిగా ఉపయోగించడం మంచిది.  తీయగూర గా గాని, పులుసు కూరగా గాని వండుకోవచ్చు.  ఆకు పచ్చడిని చేస్తే గోగాకు రుచి వస్తుంది. 



ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.


Share:

Labels

Blog Archive