ఎండుద్రాక్ష (Raisins)

ఎండుద్రాక్ష (Raisins)

ఎండుద్రాక్ష  బలవర్ధిని. ఇది రక్తాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇందిలో ఐరన్ పుష్కలంగా ఉంది. దీనిని తినగానే శక్తి వస్తుంది. ఆడవారు, రక్తహీనత గలవారు దీనిని సేవించడం వల్ల రక్తం పట్టి తెల్ల రంగుతో కాంతివంతమైన రంగు ను పొందుతారు.


10 ద్రాక్షలను పాలలో మరిగించి తింటూ, ఆ పాలను కుడా త్రాగితే మలబద్దకం తగ్గుతుంది. చెడు పదార్థాలు  విసర్జితమై నందు వల్ల ఆరోగ్యవంతులు  అవుతారు.

రాత్రులలో పిల్లలు పక్క తడుపుతూ ఉంటె వారికి నిద్రపోయే ముందు 5 ద్రాక్షలను, 2 మిరియాలు కలిపి నమిలించాలి. అలాగ రెండు మూడు వారాలు చేస్తే వారికి పక్క తడిపే వ్యాధి పోతుంది.

జ్వరం రావడం సహజం. తరువాత నోరు చేదుగా అవడం సర్వ సాధారణం. దీనికి మంచి మందు కిస్మిస్(యందు ద్రాక్ష). పెనం మీద 10 ద్రాక్షలను వేడి చేసి సైంధవ లవణం, మిరియాలు కలిపి తింటే బాగా ఆకలి పుట్టి అన్నం తినబుద్ది అవుతుంది.

అంతే  కాక, 5 ద్రాక్షలుపెనం ఫై  వేడి  చేసి 2 మిరియాలు కలిపి తింటే దగ్గు బాగా తగ్గుతుంది.


ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రయిబ్   చేయండి .

ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!

Share:

Labels

Blog Archive