తేయాకు

తేయాకు 

చవకలుగా ఉండే నీళ్ళు తాగడం వల్ల కలిగే దోషాలని పోకార్చడానికి, మాంద్యంగా ఉండే సమయాల్లో ఉత్సాహోద్రేకాలు కలగడానికి చైనా వారు తేయకుని ఉపయోగిస్తారు. జపాన్, చైనా దేశీయులు అతిధులకు తేయాకు పాయరాని పానీయం.





కాలిన గాయాలకు తేయాకు కషాయం అద్భుతంగా పని చేస్తుంది. రోగిని గాలి లేని స్థలంలో పడుకో బెట్టితెయాకు నీటిని తయారు చెయ్యాలి. సుమారు ఆరు కప్పులు  సలసల కాగిన నీటిలో ఆరు చెంచాల తేయాకుని వేసి పది నిముషాలు ఉడికించి కషాయాన్ని తయారు చెయ్యాలి. దానిని చల్లారనివ్వాలి.  కాలిన ప్రదేశంలో గల బొబ్బలను కత్తెరతో గాని, సూదితోనో గాని చిడిపి, అందులోని కౌసు నీటిని కార్చి, కమిలి ముడతలు పడియున్న చర్మమును కత్తిరించి పుండు శుభ్రం చేసి 
పరిశుభ్రమైన మెత్తని రుమాలుని నాలుగు మడతలుగా మడిచి పుండు మీద కప్పి, ఆరగా ఆరగా కప్పిన గుడ్డ మీద తేనీటిని పోయాలి.

రోగికి సత్తువ కలుగుటకు టీ ని గాని,కాఫీ ని గాని త్రాగించవచ్చు. ఇలా ప్రతిదినము చేసిన యెడల పుండు మాని పోతాయి. కొబ్బరినూనె, సిరా, మసి, పసర్లు వేటిని పూయాల్సిన అవసరం లేదు.

తేయాకు లో చమురు, టానిక్ ఆసిడ్, కాఫిన్ ద్రవ్య భాగాలూ ఉన్నందువలన కాలిన పుండ్లకు చర్మపు పొరలు ఏర్పడతాయి. ఇందులో ఏ జాతి విటమినులు లేవని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.



ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!

Share:

Labels

Blog Archive