కొత్తిమిరి (Coriandrum Sativum)

కొత్తిమిరి

ధనియాల లేత మొక్కలను మనం కొత్తిమిరి అంటాము. కొత్తిమీర ను మనం ప్రత్యేకంగా కూరగా ఉపయోగించము.  ఐన పులుసు, చారు, పచ్చళ్ళు మొదలైన వంటకాల్లో సువాసనకు ఉపయోగిస్తారు.  ఈ చెట్లని క్యాబేజీ చెట్లతో పాటు పెంచితే ఆకులని తినే పురుగులు అంతగా రావు. 


కొత్తిమీర ఆకులు కారంగా, సువాసనగ ఉంటాయి. కొత్తిమీర గాఢ కాషాయం లో పాలు, పంచదార కలిపి ఇస్తే మూల శంక, అజీర్ణ విరేచనాలు, అగ్ని మంద్యాము, కడుపులో వాయువు అధికమగుట తగ్గుతాయి.  కొత్తిమీర త్రిదోష హరమైనది. విదాహాన్ని పోగొడుతుంది. భ్రమను తగ్గిస్తుంది.  కొత్తిమీర మంచి జీర్ణ కరి. 

కొత్తిమీర రసాన్ని చనుపాల తో కలిపి కళ్ళల్లో కళికం వేస్తె నేత్ర రోగాలు తగ్గుతాయి లేదా కొత్తిమీర వెచ్చ చేసి కళ్ళకి కట్టవచ్చు. కొత్తిమీర కాషాయం లో పంచదార కలిపి తీసుకుంటే ఆకలి పుడుతుంది. 

ప్రసవించబోయే స్త్రీలకు దగ్గరగా కొత్తిమీర ఉంచితే తొందరగా కంపు అవుతుందని పెద్దవారు నమ్మేవారు.  కాన్పు ఐన తరువాత కొత్తిమీర తీసి వేయాలి. 

నోరు పూసి ఉన్నప్పుడు కొత్తి మీరా రసం తో పుక్కిలిస్తే మంచి ఫలితం దొరుకుతుంది.  ఆకుకూరల్లో కొత్తిమీర అతి మంచిది.  అది మూత్రాన్ని బాగా జారి చేసుంది.  కొత్తిమీర ని పచ్చడి గా వాడుకోవచ్చు.  కొత్తిమీర ఆకుల్ని, పచ్చి మిరప కాయలని తొక్కి తగినంత ఉప్పు వేసి నిమ్మ కాయ రసాన్ని పిండినా గాని రుచిగా ఉంటుంది.  దీనిని కొత్తిమీర కారమంటారు

గ్రహణి రోగంతో బాధపడేవారు కొత్తిమీరను అస్సలు వాడకూడదు. 



ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.


Share:

Labels

Blog Archive