ఇంగువ ప్రాముఖ్యత

మరిగించిన ఇంగువకు సమానంగా నల్ల ఉప్పు కలిపి చూర్ణం చేసుకోవాలి. తేనెలో పిసర గింజంతపరిమాణంలో ఈ చూర్ణం కలిపి నాకిస్తే, పిల్లలలోని కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిపోతాయి.

ఇంగువను కొంచెం వేడి చేసి పంటిలో ఉంచితే బాధ ఉపసమిస్తుంది.

పొంగించిన అర గ్రాము ఇంగువను ఆవు నెయ్యితో కలిపి ప్రతి రోజు సేవిస్తే దగ్గు తగ్గు తుంది.



10 గ్రాముల హారతి కర్పురంలో, 10 గ్రాముల పొంగించిన ఇంగువ కలిపి నూరి, కంద గింజ సైజు మాత్రలు చేసుకొని పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పుఉతల వేడి నీటితో వేసుకుంటే కడుపు ఉబ్బరం నుంచి ఉపసమనం లభిస్తుంది.

పెసర గింజంత ఇంగువను నీళ్ళల్లో కరిగించి, నొప్పి ఉన్న వైపు ముక్కుల్లో మూడు చుక్కలు వేసుకొని నస్యంగా పీలిస్తే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.


ఇంగువ , సైంధవ లవణం , సొంటి ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకొని 30 గ్రాముల ఆవనూనె లో కలిపి నూనె మాత్రమే మిగిలేలా వేడి చేయాలి. ఆ నూనె నాలుగు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి పోటు మాయం అవుతుంది.

 

పొంగించిన ఇంగువను మంచినీళ్ళలో అరగదీసి, ఆ గంధాన్ని కాలిన చోట లేపనంగా వేస్తేకాలిన గాయాలు,బొబ్బలు మాని పోతాయి.


 

 

Share:

No comments:

Post a Comment

Labels

Blog Archive