కరివేప ఆకు (Murraya Konigii)

కరివేపాకు

కరివేపాకు ను అరవం లో కరివేప్పాయ్ అని అంటారు.కైదర్య, మహానింబ, రావణ, గిరినిమ్బిక  అనేవి సంస్కృత నామాలు.  సురభి నింబ అని కూడా అంటారు ఎందుకంటె వాసనా వేప అని అర్ధం. కృష్ణ నింబ  అనగా కరి(నల్ల) వేప అని అర్ధం.
కరివేప ఆకులూ భారతదేశంలో సువాసనగ ఉండడంతో వంటకాలలో విరివిగా వాడతారు. పెరటి చెట్లలో ఇది ముఖ్యమైంది అని చెప్పవచ్చు.




కరివేపాకు  చెట్టు బియ్యపు కడుగు నీళ్ళు పోస్తే ఏపుగా పెరుగు తుంది. తరచూ బియ్యపు కడుగు నీళ్ళు పోస్తే వాటి ఆకులూ హెచ్చు సువాసన కలిగి ఉంటాయి . సర్వ ఔషదం గుణ కల్పకం అని అంటారు. కరివేపాకు కఫా వాతాలను  పోగొడుతుంది. కరివేపాకు పధ్యకరమైంది. గ్రహని రోగాన్ని  పోగొడుతుంది.

కరివేపాకులో   కారము, చేదు, వగరు అనే మూడు రసాలు కలిగి ఉన్నాయి.కరివేపాకు మనం కేవలం కూరల్లో సువాసన కోసం చేరుస్తున్నాము. కూరలుగా ఎవరు చేసుకోరు. కాబట్టి దీనిని అకుకురల్లో చేర్చారు.

కరివేపాకులో అవిరియై పోయా స్వభావం గల నూనె  ఉంది. వికారల్లో కరివేపాకు రసం బాగా పని చేస్తుంది. కడుపునకు చాల మేలు చేస్తుంది. జిగట విరోచనాలు కరివేప చిగుళ్ళు వట్చివే నమిలి తింటే గునకారిగా ఉంటుంది. జ్వరాలలో ఇచ్చే కషాయాల్లో కరివేపాకు కూడా వేస్తారు. ఈ కషాయాన్ని కలరా వ్యాధి ని పోగార్చగల సమర్ధత కలదని వైద్యుల మతము.

కరివేపాకు పాలల్లో ఉడికించి ముద్ద చేసి విష జంతువుల కట్లకు, దద్దుర్లు మందుగా ఉపయోగరిస్తారు.

కరివేపాకు,  మినపపప్పు, మిరపకాయలు కలిపి నేతితో వేయించి అందులో తగు మాత్రములో ఉప్పు వేసి నిమ్మకాయ రసం పిండి తయారు చేసిన పచ్చడిని కరివేపాకు కారమని పిలుస్తారు. ఈ పచ్చడి పైత్య శాంతిని కలిగి నోటి అరుచిని పోగొడుతుంది.

ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.



Share:

No comments:

Post a Comment

Labels

Blog Archive