క్యాబేజీ - విదేశపు ఆకు కూర
ఇది ఒక విదేశపు ఆకు కూర. ఐరోపా దేశీయుల ముఖ్య ఆకు కూర. విదేశీ ఆకుకూరల్లో ఇది మిక్కిలి రుచివంతమైనది. చుడ్డానికి కాబేజీ దిమ్మ లాగా ఉంటుంది. అది మొక్క యొక్క మధ్య ఆకుల అన్నిటి చేరిక చేత ఏర్పడినది. కాబేజీ ఆవ మొక్క కుటుంబుం లోనిది.
విత్తనాలు చల్లిన
వారం రోజులలోగా కాబేజీ గింజలు మొలుస్తాయి మూడు, నాలుగు మాసాలకు కాబేజీ కూరగా
అందుతుంది. కాబేజీ గింజలు నెలకు ఒక సరి చల్లుతూ సంవత్సరం పొడవున పంట ఉండేటట్లు
చేసు కోవచ్చు. శీతల ప్రదేశాలు, శీతల కాలము కాబేజీ సాగుకు అనుకూలమైనది. చిన్న కాబేజీ
మొక్కలని గొంగళి పురుగులు పాడు చేస్తాయి. మెలకువ చాల అవసరం.కాబేజీ ఎదుగుదలకు గొర్రెల పెంట, మేకల పెంట మంచి ఎరువు.
కాబేజీ పైకి కాయగా
కనిపిస్తుంది. కాని నిజానికి అది ఆకుల మూట. ఆ మూట లోని ఆకులు లోపలికి పోయిన కొద్ది
తెల్లగా ఉంటాయి. పై ఆకులు కారు పచ్చ గా ఉంటాయి. లోపలి ఆకుల కంటే, పై ఆకుల్లో దేహ
పోషక పదార్ధాలు ఉంటుందని గుర్తున్చుకోవాలి. తరగడానికి పూర్వం మారు రంగులో ఉన్న
క్యాబీజి ఆకులని జాగ్రత్తగా తీసివేయాలి.
సి విటమిన్ ఉడకబెట్టక ముందు ఎంత ఉందో , ఉడకబెట్టిన తరువాత కూడా అంతే
ఉంటుంది.
క్యాబేజీ ఆకుకూర
కోసి తెచ్చినప్పటి నుండి భిజించ బెడే లోపు సి విటమిన్ హెచ్చు గా కోల్పోతుంది. మర్కేట్టులో కొనే క్యాబేజీ లో నూటికి 60 శాతం
మాత్రమె ఉంటుందని చెప్పవచ్చు. నిలవలో
రవాణాలో 40 శాతం తగ్గిపోతుంది. ఇంకో ఇరవై
శాతం కోయడంలో కడగడం లో నశిస్తుంది. వాస్తవ
రూపం లో మనం తినే క్యాబేజీ కూర లో కేవలం 17 శాతం మాత్రమే సి విటమిన్ కలిగి
ఉంటుంది.
క్యాబేజీ
ఉడికించేటప్పుడు వంట పాత్ర పైన మూత మూయకూడదు.
క్యాబెజిలో గంధకం, సున్నం, భాస్ఫరం, ఇనుము మొదలైనవి ఉన్నాయి. క్యాబేజీ చర్మానికి మేలు చేస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. క్యాబెజిలో గంధకపు పాలు ఉండడం వల్ల వాసనా
గబ్బుగా ఉంటుంది.
క్యాబేజీ ఆకు కూర
రక్త వృద్ధి కరమైనది. కాక చేసి శరీరాన్ని
ఆరుస్తుంది. శీతప్రక్రుతి కలవారికి
క్యాబేజీ కూర మిక్కిలి పధ్యకరము. తలలో
వేడిని తగ్గించి బాగా నిద్ర పట్టేటట్టు చేస్తుంది.
శరీరం మీద లేచే పులిపిరి కాయలు, చమట కాయలు, మొటిమలు
మొదలైనవి క్యాబేజీ రసం సేవిస్తే తగ్గిపోతాయి. కంఠం నొప్పిగా ఉండే జబుల్లో ఐర్లాండ్
దేశీయులు క్యాబేజీ ఆకులు వేసి కంఠం పైన
కడతారు. మద్యపానం చేత కలిగే మాంద్యాన్ని
పోగొట్టడం లో ఇది ప్రశస్తమైనది. కాబట్టి
ఇది తెల్ల దొరలకి ఆప్యాయ కరమైన కూర.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి.