చిర్రి కూర

చిర్రి కూర 

రుచికరమైన ఆకుకూరలలో చిర్రి కూర ఒకటి.  సంస్కృతం లో తండులీయ, మేఘనాధ, ఘన స్వన , భండీర, విషఘ్న, కచర అని అంటారు.  కొద్దిపాటి తేమ గల ప్రదేశాల్లో ఈ కూర బాగా పెరుగుతుంది. 

చిర్రి కూర మూడు రకాలు
1)    చిర్రి
2)    నీటి చిర్రి
3)    చిన్న చిర్రి

నీటి చిర్రి గురించి వైద్య గ్రంధాలలో పేర్కొనబడింది.  కాని దానిని వంటల్లో వాడినట్టు ఆనవాలు లేదు.  చిర్రి కూర గుణాల్ని సర్వౌషది గుణ కల్పకం అని అంటారు. 

చిర్రి కూర లఘువుగా, శీతలంగా ఉంటుంది. కాక చేస్తుంది.  పిత్తాన్ని, కఫాన్ని, రక్త దోషాన్ని పోగొడుతుంది.  మల మూత్రాలని బయటకి తెస్తుంది.  చిర్రికూర స్థావర విషాన్ని, జంగమ విషాన్ని అనగా (పాము మొదలైన జంతువుల విషాన్ని ) హరిస్తుంది.  విష రక్తాన్ని శుభ్రపరచడంలో ఇది పెట్టింది పేరు.  పెట్టు మందుల దోషాన్ని పోగొట్టడానికి చిర్రి కూరను వండి పెడతారు.   రస సంభందమైన పట్లను ఇది పోగొడుతుంది.  ఈ కూర బాగా ఆకలిని కలిగిస్తుంది.  త్రిదోషాలని పోకారిస్తుంది.  కాళ్ళ జబ్బులు, మెదడు జబ్బుల కల వారికి ఇది మిక్కిలి హిత కరమైనది.

ఈ కూర లో ఉక్కు లోహం ఉందని చెబుతారు.  గుండె జబ్బులకి ఇది మంచిది.  ఇది పధ్యకారిగా ఉంటుంది. అతిసార రోగాన్ని తగ్గించే గుణం దీనికి ఉంది. 

ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.


Share:

Labels

Blog Archive