జీలకర్ర
జీలకర్రను రక్తం
శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారని అందరికి తెలుసు.
ఇది చలువని ఇస్తుందని కూడా
తెలుసు. జీలకర్రను ఆంగ్లం లో కుమిన్
సీడ్స్ అంటారు. జీలకర్రని నమలడం వల్ల
నోటిలో దుర్వాసన పోతుంది. అంతే కాకా పళ్ళు
చిగుళ్ళు గట్టిబడతాయి, పళ్ళ సందుల్లో పురుగులు ఎవైన ఉంటె అవి చనిపోతాయి.
ఔషద గుణాలు:
1.
ఇది
లోపలి అవయవాలని కాపాడుతుంది.
2.
గ్యాస్
ని బయటకి నెట్టివేసే గొప్ప మహాత్కరి.
3.
రక్త
శుద్ధిని చేసి రక్తాన్ని వృద్ధి
చేస్తుంది.
4.
ఇది
కాలేయానికి చాల మంచిది.
5.
వ్యాధి
నిరోధక శక్తి ని పెంచుతుంది.
6.
వదిలి
వదిలి వచ్చే నొప్పులను ఇది తగ్గిస్తుంది.
7.
అల్సర్
కి ఇది మంచి మందు గా పనిచేస్తుంది.
8.
చమట
గుల్లలని తగ్గిస్తుంది.
9.
గాఢమైన నిద్ర పడుతుంది.
10. ఊబకాయాన్ని
తగ్గిస్తుంది.
11. దీనిని
యంటి కాన్సర్ అని అంటారు, కాన్సర్ వ్యాధిని పూర్తిగా నయం చేయడం లో దోహద పడుతుంది.
12. మూత్ర
నాళాల వ్యాధిని అరికడుతుంది.
13. పచ్చ
కామేర్లను పొగుడుతుంది.
14. బీపీ
ని నియంత్రించి రక్త ప్రవాహాన్ని సరిచేస్తుంది.
15. గుండెకి
టానిక్ లా పనిచేస్తుంది.
సేవించడం ఎలా?
జీలకర్ర ని సున్నపు
నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఎండలో ఎండబెట్టి, ఆరాక ఒక డబ్బా లో
భద్రపరచాలి. అవసరానికి అందులో నుండి కొంత జీలకర్రను తీసుకొని, పొడి చేసుకొని
వాడుకోవాలి. మొత్తాన్ని పొడి చేసి వాడితే
అందులో ఉన్న నునే పదార్ధం ఆవిరి అవుతుంది.
వెన్న, జీలకర్ర
కలిపి మిశ్రమంలా చేసి ఉసిరి కాయ అంత పరిమాణం లో కడుపులోకి తీసుకొంటే అల్సర్
మటుమాయం అవుతుంది.
పసుపు అరటిపండును
గుజ్జుగా చేసుకొని జీలకర్ర పొడితో కలిపి రెండు స్పూన్ల పరిమాణం లో తీసుకొంటే
రాత్రి నిద్ర బాగా పట్టి, సెడేటివ్ గా పనిచేస్తుంది. అధిక బరువుని తగ్గిస్తుంది.
అనాస పండు మరియు
జీలకర్ర పొడి కలిపి తీసుకొంటే రక్త ప్రసరణను సరిచేస్తుంది. అంటే కాక కడుపులో ఉన్న
పురుగుల్ని హత మార్చి బయటకు నెట్టివేస్తుంది.
ఒక గ్లాసు నీళ్ళలో
కొంత కొత్తిమీర రసం, జీలకర్ర పొడి మరియు ఉప్పు కలిపి తీసుకొంటే ,
ఇది ఒక డైజెస్ట్ఇవ్ టానిక్ గా పనిచేస్తుంది. జీర్ణ శక్తిని పెంచి ఆహారాన్ని అరగడానికి
ఉపకరిస్తుంది.
గ్లాసు నీళ్ళలో ఒక
టీ స్పూన్ జీలకర్ర పొడి, ¼ టీ
స్పూన్ మిరియాల పొడి, 2 యాలకులు కలిపి కషాయాన్ని తయారు చేసి రోజూ తాగితే హై బీపీ నియంత్రిస్తుంది.
ఇది లేపనంగా కూడా ఉపయోగిస్తారు.
అర బడ్డ నిమ్మకాయని పిండి అందులో ఒక టీ స్పూను జీలకర్ర పొడి కలిపి వేసవి కాలం లో వచ్చే
చమట గుల్లలకు రాస్తే అవి మాయమైపోతాయి. అంతే కాక ఈ మిశ్రామాన్ని కొద్దిగా నీటిలో కలిపి
తాగితే ఒంటికి చలువ చేసి వడ దెబ్బ నుంచి కాపాడుతుంది.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రయిబ్ చేయండి.