చుక్క (Rumex sp.)

చుక్క కూర 

చుక్క మొక్క బచ్చలిని  పుల్లగా ఉంటుంది. అందుకే చుక్క ఆకుని కొన్ని ప్రాంతాల్లో పుల్ల బచ్చలి అంటారు. చుక్కకులో జిగురు పదార్ధం ఉంది. చుక్క కూర రెండు రకాలు: చుక్క కూర, చిన్న చుక్కకూర.
చాంగేరీ, ఆమ్లికా, చుక్ర అని చుక్క కూరకు, క్షుద్రామ్లికా, చతుస్చాద అని చిన్న చుక్క కూరకి సంస్కృతం లో నామాలు.





చుక్క కూర పుల్లగా, తియ్యగా ఉంటుంది. చిన్న చుక్క కూర రస కాలమందు బాగా పుల్లగా, వగరుగా ఉంది ముఖ శుద్ధిని, అగ్నిదీప్తిని కలిగిస్తుంది.

చుక్క కూర అగ్నిదీపనాన్ని చేస్తుంది. రుచిని పుట్టిస్తుంది. లఘువుగా, వేడిగా ఉంటుంది. కఫాన్ని,  వాతాన్ని పోగొడుతుంది. పిత్తాన్ని కలిగిస్తుంది. గ్రహణి, మూలరోగం, అతిసారం, కుష్టుని నసింప చేస్తుంది. సర్వ ఔషది గుణ కల్పకం.మలబద్దకాన్ని తొలగించి సుఖ విరేచానాన్ని చేసేదిగా ఉంటుంది. వాంతులు కట్టడంలో కూడా ఈ కూర సమర్ధమైంది.

ఉష్ణ తత్వం కల వారికి ఇది చాల మేలు చేస్తుంది.జీర్ణకోశంలో కనిపించే మంటను, వేడిని ఇది  తగ్గిస్తుంది.మూల రోగాలు, గుల్మాలు, క్షయ, మేహ వ్యాధులకు పత్యకరమైన కూర.

గుండె జబ్బుల్లో కూడా ఇది హితకరమైంది. ఆమ వాతాన్ని, గుండె నొప్పిని తగ్గించి అగ్ని మాంద్యాన్ని పోగొడుతుంది. రస దోషాలు, విషదోషాలు పోగొట్టడానికి ఈ కూర ప్రసష్ఠమైంది. చుక్క ఆకుని వెచ్చ చేసి చెవిలో పిండితే చెవి పోటు నయమౌతుంది . చుక్క కూర వీర్య వృద్ధి కరమైనది.

ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి


Share:

Labels

Blog Archive