టీ స్పూన్ కి మరియు టేబుల్ స్పూన్ కి గల తేడ ??
మనం అందరం
అప్పుడప్పుడు టీవిలో రక రకాల వంటా వార్పూ ప్రోగ్రామ్స్ ను చూస్తుంటాం. అందులో కొలత
కోసం కొన్ని ఆ వంట కు కావలసిన వస్తువులని టీ స్పూన్స్ తోటి మరికొన్ని వస్తువులను టేబుల్
స్పూన్స్ తోటి సరిపోయేలా తీసుకోమని అంటుంటారు.
కొంత మందికి ఇది చాల కన్ఫ్యూషన్ కలిగిస్తూ ఉంటుంది. ఏ విషయమైన తెలుసుకొనేంత వరకు కాస్త కన్ఫ్యూషన్
గానే ఉంటుంది. తెలుసుకున్నాక చాల ఈజీగా ఉంటుంది. అంతేనా అని కూడా అనిపిస్తుంది.
సులువైన సమాధానం :
3 టీ స్పూనులకు ఒక టేబుల్ స్పూన్ కొలత
అన్నమాట.
యునైటెడ్ కింగ్డమ్
కొలతల ప్రకారం, సుమారు ఒక టేబుల్ స్పూనుకు 15 మిల్లీలీటర్లు. అంటే ఒక టీ స్పూనుకు సుమారు
5 మిల్లీలీటర్లు. (లీటర్ కు 1000 మిల్లీలీటర్లు)
టేబుల్ స్పూన్ ని
అప్పుడప్పుడు వడ్డించ డానికి కూడా వాడుతారు. ఎందుకంటే టేబుల్ స్పూన్ దాదాపు ఐదున్నర
నుండి ఆరు అంగుళాల పొడవు ఉంటుంది.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రయిబ్ చేయండి.