క్యాలి ఫ్లవర్
ఇది మెదడు
ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇది బహు ఉపయోగకరమైన
ఆహరం. ఇందులో విటమిన్ A, B, E, K, C
నిండుగా ఉంటాయి. మెగ్నీషియం, సల్ఫర్, ఫాస్ఫరస్,
సెలనియం ఉంది.
ఔషద గుణాలు:
1. ఇది గుండెకి
బలాన్ని చేకూరుస్తుంది. ( Cardio Tonic )
2. కిడ్నీలను శుభ్రపరుస్తుంది.
3. ఇది యంటి ఇన్ఫ్లమేటరి
గా పనిచేస్తుంది.
4. గర్భవతులకు దీనిని
ఆహారంగా ఇస్తే పుట్టబోయే బిడ్డ మెదడు బాగా పెరిగి, వేనుముక్క గట్టి పడుతుంది.
5. కీళ్ళ వ్యాధి మరియు
గౌట్ వ్యాధికి ఇది బాగా పని చేస్తుంది.
6. జీర్ణ శక్తి ని
పెంపొందిస్తుంది
7. ఇది ఒక యాంటి ఆక్సిడంట్
క్యాలి ఫ్లవర్ పేస్టు
రెండు టేబుల్ స్పూన్లు , రెండు వెల్లుల్లి పాయలు, చిటికెడు మిరియాల పొడి కాషాయం చేసి
తాగితే ఎముకల కీళ్ళ వాతం తగ్గుతుంది. ఒంటి నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ కషాయాన్ని హృద్రోగులు తీసుకొంటే గుండెకు మేలు
కలుగుతుంది.
పచ్చ రంగు కయాలి ఫ్లవర్
ఆకులూ నూరి, కొద్దిగా ఆముదాన్ని కలిపి పెనం మీద బాగా వేడి చేసి చల్లారాక, వాపులు ఉన్న
చోట గుడ్డ సహాయంతో కడితే నొప్పులు హరిస్తాయి. ఈ లేపనాన్ని పై పూతగా మాత్రమే వాడాలి.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రయిబ్ చేయండి .