సోరకాయా ....... మజాకా

100 గ్రాముల సొరకాయ తింటే దాని ద్వారా సమకుఉరేది కేవలం 15 క్యాలరీలు మాత్రమే. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది.


సోరకాయలో తొంభై ఆరు  శాతం నీరే. ఇందులో విటమిన్ సి, రిబోఫ్లావిన్, జింక్, థయామిన్ , ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. నీరసంగా ఉన్నవారు అలసటగా ఉన్నవారు దీనిని ఎక్కువగా సేవిస్తే శక్తి తొందరగా సమకూరుతుంది.

 

100 గ్రాముల సోరకాయలో కేవలం 1 గ్రాము కొవ్వు మాత్రమే ఉంది. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులున్నవారు దీనిని ఆహారంగా తీసుకోవాలి.

 

సోరకాయలో పీచు పదార్ధం ఎక్కువ పాళ్ళల్లో ఉండడం వలన మల బద్ధకం నివారిస్తుంది. గ్యాస్ సమస్యలు ఉన్నవారు దీనిని సేవిస్తే మంచిది.

 

ఉబకాయం ఉన్నవారికి  ఇందులో డయటరి ఫైబర్ ఉండడం వలన తొందరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది, అధిక బరువు తగ్గడంలో బాగా సహాయం చేస్తుంది.



సొరకాయ కాలేయానికి మేలు చేస్తుంది. దాని పని తీరుని మెరుగు పరుస్తుంది.

 

పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన బీపీ వున్నా వారు దీనిని విరివిగా వాడవచ్చు.  

Share:

No comments:

Post a Comment

Labels

Blog Archive