రుచి ఉన్న జాజికాయ వివిధ రకాల ఔషధ గుణాలు

 రుచి ఉన్న జాజికాయ వివిధ రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. జాజికాయను వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.



జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పురుషుల్లో కామవాంఛను పెంచుతుంది. వీర్యకణాల ఉత్పత్తి పెరిగేందుకు దోహదపడుతుంది. జాజికాయను కొద్దిపాటి మంటమీద నేతిలో వేయించి పొడి చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని ఐదు గ్రాముల మోతాదుగా ఉదయం, సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలతో కలిపి తాగినట్లయితే చక్కటి ఆరోగ్య ఫలితాలు మీ సొంతం. నపుంశకత్వాన్ని తరిమికొడుతుంది. నరాల బలహీనతను పోగొడుతుంది. ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచడంలో ఉపయోగపడుతుంది.

కొంచెం జాజికాయ పొడిని తీసుకుని దానికి నీళ్ళు లేదా తేనె కలిపి ఫేస్ ప్యాక్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి స్క్రబ్ లా రాసుకోవాలి. ఇలా చేస్తే కొన్నిరోజులకు చర్మం కాంతి వంతమవడంతో పాటు మచ్చలు, మొటిమలు పోయాయి.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Labels

Blog Archive