గ్యాస్ సమస్య నుండి ఉపశమనానికి ఇలా చేయండి..

జీర్ణకోశంలో ఉండే మ్యూకస్ పొరలు వాపునకు గురైనప్పుడు, పలు రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల, ఒత్తిడి, ఆందోళనకు ఎక్కువగా లోనవడం వల్ల, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మద్యం సేవించడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తుంటాయి. అయితే ఇలా వచ్చే గ్యాస్ సమస్యను పలు సింపుల్ టిప్స్ పాటించడం వల్ల సులభంగా తగ్గించుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 





1. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, అర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తాగితే గ్యాస్ సమస్య ఉండదు. 

2. పుదీనా, చామంతి, రాస్ప్‌బెర్రీ రుచులలో ఉండే టీని తాగినా గ్యాస్ సమస్య బాధించదు. 

3. పసుపు ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ పాలలో కలుపుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య ఇట్టే పోతుంది. 

4. రోజూ ఉదయాన్నే పరగడుపున‌ 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగినా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. 

5. గ్యాస్ సమస్యకు అల్లం చాలా మెరుగ్గా పనిచేస్తుంది. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నమిలి మింగాలి. లేదంటే 1 టీస్పూన్ అల్లం రసం తాగినా చాలు. సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

6. ఆలుగడ్డలను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. దీన్ని రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య రాదు. 

7. భోజనానికి ముందు రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగాలి. లేదంటే వాటి రసం తాగినా చాలు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. 

8. దాల్చినచెక్కను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగాలి. భోజనానికి ముందు ఈ నీటిని తాగితే గ్యాస్ రాదు. 

9. భోజనం చేశాక 2, 3 యాలకుల్ని అలాగే నమిలి తిన్నా గ్యాస్ రాదు. 

10. రోజూ ఏదో ఒక సమయంలో కొబ్బరినీళ్లను తాగుతుంటే గ్యాస్ రాకుండా ఉంటుంది. 

11. ఒక గ్లాస్ వేడి నీటిలో 3 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది. 

12. రోజూ మజ్జిగలో నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్) కలుపుకుని తాగినా గ్యాస్ సమస్య బాధించదు. 

13. కొద్దిగా కొత్తిమీర తీసుకుని దాన్నుంచి రసం తీసి ఆ రసం తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది. కొత్తిమీరను నేరుగా తిన్నా సరే ఈ సమస్య రాదు. 

14. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో నల్ల మిరియాల పొడి వేసుకుని కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది. 

15. ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ ఇంగువను వేసి కలిపి తాగితే గ్యాస్ బారి నుంచి బయట పడవచ్చు. 

16. భోజనం చేశాక సోంపు, లవంగాలు, వాము నమిలి మింగాలి. దీని వల్ల కూడా గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు. 

17. రోజూ వేడి నీటిని తాగడం అలవాటు చేసుకుంటే గ్యాస్ సమస్య రాదు. తిన్న ఆహారం జీర్ణం సరిగ్గా అవుతుంది.
Share:

No comments:

Post a Comment

Labels

Blog Archive