ముల్లంగి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..:-

జాండిస్(కామెర్ల)నుండి కాపాడుతుంది: ముల్లంగిని తినడం వల్ల లివర్ మరియు కడుపును మంచి కండీషన్ లో పెడుతుంది. అంతే కాదు, శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఇంకా ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ ను సప్లై చేస్తుంది. ముల్లంగి ఆకులను మరియు బ్లాక్ రాడిష్ ను జాండిస్ నివారణకు ఉపయోగిస్తారు.


పైల్స్(మెలలు)నివారణకు: ముల్లంగి శరీరంలోని విషాలను బయటకు నెట్టేసే గుణాలు చాలా ఉన్నాయి. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పైల్స్ నివారణకు బాగా సహాయపడుతుంది. పైల్స్ అధికంగా కాకుండా అడ్డుకుంటుంది. ముల్లంగి జ్యూస్ మన జీర్ణక్రియకు బాగా సహాయపడి పైల్స్ రాకుండా అడ్డుపడుతుంది.

మూత్ర సంబంధిత వ్యాధులను కంట్రోల్ చేస్తుంది: ముల్లంగిలో ఉండే డ్యూరెటిక్, ఇది శరీరంలో యూరిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ఏర్పడే మలినాలను తొలగించడానికి, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి మరియు యూరినేటింగ్ సమయంలో ఏర్పడే బర్నింగ్ సెన్షేషన్ వంటి వాటికి నివారిణిగా పనిచేస్తుంది. ముల్లంగిని తరచూ ఆహారంతో తీసుకోవడం వల్ల శరీరంలో మలినాలను బయటకు పంపడానికి సహాయపడే కిడ్నీలు మరియు యూరినరీ సిస్టమ్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.
బరువు నియంత్రణ: బరువు తగ్గాలనుకొనే వారికి ముల్లంగి చాలా ఉపయోగకరం. ముల్లంగిలో జీర్ణక్రియ సక్రమంగా జరిగి విరేచనము సాఫీగా జరిగేందుకు ఉపయోగపడే పీచుపదార్థం మరియు కార్బోహైడ్రేట్స్ తో కలిగిన నీరును కలిగి ఉంటుంది. అందువల్ల బరువు పెరుగేందుకు సహకరించదు. ముల్లంగి క్యాలరీలు పెంచ కుండానే ఆకలిని సంత్రుప్తి పరుస్తుంది.
క్యాన్సర్ నివారిణి: ముల్లంగిని మన డైలీ డయట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ (కోలన్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్, కిడ్నీ కాన్సర్, మరియు ఓరల్ క్యాన్సర్ )లను రాకుండా కాపాడుతుంది.
Share:

Labels