నల్లేరు మహౌషధి

వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని సంస్కృతంలో పేరు హిందీలో 'హడ్ జోడ్'గా పిలువబడే నల్లేరు, విరిగిన ఎముకలు చాలా త్వరితంగా అతుక్కోవడానికి ఉపకరించే ప్రాచీన మహౌషధి. దీనిని భావమిశ్రుడు తన 'భవప్రకాశ' గ్రంథంలో వివరించారు.
'సిసస్ క్వాడ్రాంగులా' లాటిన్ నామధేయముగల నల్లేరును, గ్రామీణంలో వడియాలు, పచ్చళ్లు చేసుకొని ఆహార పదార్థంగా వినియోగించుకుంటారు. దీనిలో విటమిన్‌'సి', కెరోటిన్ ఎ, స్టెరాయిడల్ ధాతువు, కాల్షియం అధిక మొత్తంలో వున్నాయని పరిశోధకులు గుర్తించారు.
కార్టిజోన్ దుష్ఫలితాలను నిలువరించి దాని యాంటీ ఎనబాలిక్ గుణాన్ని సాంద్రతను తగ్గించి, ఎనబాలిక్ ఓషధంగా పరిగణించే 'డ్యూరాబొలిన్'కంటె ఉత్తమ గుణం ఈ 'నల్లేరు'లో వున్నాయని
పరిశోధకులు ధృవీకరించారు. అస్థి ధాతువు వేగంగా ప్రవృద్ధమయేందుకు నల్లేరు విశేషంగా దోహదం చేస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కోడానికి అవసరమయే 'మ్యూకోపాలిసాక్రైడ్స్' దీనిలో విశేషంగా వున్నాయి. ఇవి రక్తము ద్వారా కణజాలములో కలిసి వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది.



నల్లేరు:-నల్లేరు యొక్క సాంకేతిక నామం CISSUS QUADRA GULARIS లేక VITUS QUADRANGU LARIS. ఆంగ్లములో DEVILS BACK BONE అంటారు. దక్షిణ భారతంలో మరియు శ్రీలంకలో ఎక్కువగా లభ్యమవుతుంది.

విరిగిన ఎముకలు అతుక్కోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అస్థిసంహార అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా 1.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కాండం చతురస్రాకారంలో వుంది. 8-10 సెంటీమీటర్ల దగ్గర 'గణుపు' వుంటుంది. ఆ గణుపు దగ్గర వేరు లేక తీగల వంటి CLIMBING ROOTS వస్తాయి. ఆకులు కూడా ఆ గణుపు దగ్గరే వస్తాయి. దీని కాండం ఓషధ ప్రయోగానికి ఉపయోగిస్తుంది. తుంచితే జిగురు వస్తుంది. హిందీలో 'హడ్‌జోడ్'గా పిలుస్తారు.
దీనిలో ఎక్కువ శాతం కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సి, కాల్షియమ్ ఆక్సలేటర్ వంటి రసాయనాలు లభ్యమవుతాయి. ఈ ఓషధి ఘనసత్వం ఊబకాయం తగ్గించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో బాగా ఉపయోగిస్తుంది. కొన్ని సందర్భాలలో ఊహించని విధంగా అనుకోకుండా మేలును చేకూర్చే వస్తు సముదాయం మన పక్కనే వుందని గమనించకుండా వుండి ఎవరో చెబితే 'మహౌషధి' అది ఇతరులు చెప్పినపుడు ఆశ్చర్యమవుతుంది. అటువంటి మహౌషధి నల్లేరు.
Share:

No comments:

Post a Comment

Labels