ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి

ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.కాచిచలార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్లు కరిగిపోతాయని అంటున్నారు. అల్లంరసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుందంటున్నారు.పొట్టలో నులిపురుగులు నశిస్తాయని, జలుబు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్‌ స్పూన్‌ తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.



 బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గు ముఖం పడతాయని నిపుణులు వాపోతున్నారు. అంతేకాకుండా తులసీ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తుంది.అల్సర్‌ల నుండి రక్షిస్తుంది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా నియంత్రిస్తుంది. కాలేయం శక్తివంతంగా పనిచేయడానికి దోహదపడుతుంది. నోటినుండి దుర్వాసన వెలువడకుండా నిషేధిస్తుంది.
అలర్జీల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎండవల్ల సోకే అలర్జీలు, పొగ, దుమ్ము నుండి శరీరానికి కలిగే హానిని అరికడుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. దాదాపు అందరి ఇళ్లలోనూ ప్రధాన ద్వారానికి ఎదు రుగా లేదంటే పెరట్లో తులసి మొక్క ఉంటుంది. ఎందుకంటే తులసి ఆకుల నుంచి వచ్చే సువాసన ఇల్లంతా పరుచుకొని మంచి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తూ వ్యాధులు రాకుండా చేస్తుందని విశ్వసిస్తారు. తులసి ఆకులను చప్పరించడం వల్ల దానిలో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తులసి ఆకులో ఉండే రసం ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అందుకే చాలా దేవాలయాలలో తీర్ధంలో తలసీ దళాలను వేసిస్తారు.
Share:

నల్లేరు మహౌషధి

వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని సంస్కృతంలో పేరు హిందీలో 'హడ్ జోడ్'గా పిలువబడే నల్లేరు, విరిగిన ఎముకలు చాలా త్వరితంగా అతుక్కోవడానికి ఉపకరించే ప్రాచీన మహౌషధి. దీనిని భావమిశ్రుడు తన 'భవప్రకాశ' గ్రంథంలో వివరించారు.
'సిసస్ క్వాడ్రాంగులా' లాటిన్ నామధేయముగల నల్లేరును, గ్రామీణంలో వడియాలు, పచ్చళ్లు చేసుకొని ఆహార పదార్థంగా వినియోగించుకుంటారు. దీనిలో విటమిన్‌'సి', కెరోటిన్ ఎ, స్టెరాయిడల్ ధాతువు, కాల్షియం అధిక మొత్తంలో వున్నాయని పరిశోధకులు గుర్తించారు.
కార్టిజోన్ దుష్ఫలితాలను నిలువరించి దాని యాంటీ ఎనబాలిక్ గుణాన్ని సాంద్రతను తగ్గించి, ఎనబాలిక్ ఓషధంగా పరిగణించే 'డ్యూరాబొలిన్'కంటె ఉత్తమ గుణం ఈ 'నల్లేరు'లో వున్నాయని
పరిశోధకులు ధృవీకరించారు. అస్థి ధాతువు వేగంగా ప్రవృద్ధమయేందుకు నల్లేరు విశేషంగా దోహదం చేస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కోడానికి అవసరమయే 'మ్యూకోపాలిసాక్రైడ్స్' దీనిలో విశేషంగా వున్నాయి. ఇవి రక్తము ద్వారా కణజాలములో కలిసి వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది.



నల్లేరు:-నల్లేరు యొక్క సాంకేతిక నామం CISSUS QUADRA GULARIS లేక VITUS QUADRANGU LARIS. ఆంగ్లములో DEVILS BACK BONE అంటారు. దక్షిణ భారతంలో మరియు శ్రీలంకలో ఎక్కువగా లభ్యమవుతుంది.

విరిగిన ఎముకలు అతుక్కోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అస్థిసంహార అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా 1.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కాండం చతురస్రాకారంలో వుంది. 8-10 సెంటీమీటర్ల దగ్గర 'గణుపు' వుంటుంది. ఆ గణుపు దగ్గర వేరు లేక తీగల వంటి CLIMBING ROOTS వస్తాయి. ఆకులు కూడా ఆ గణుపు దగ్గరే వస్తాయి. దీని కాండం ఓషధ ప్రయోగానికి ఉపయోగిస్తుంది. తుంచితే జిగురు వస్తుంది. హిందీలో 'హడ్‌జోడ్'గా పిలుస్తారు.
దీనిలో ఎక్కువ శాతం కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సి, కాల్షియమ్ ఆక్సలేటర్ వంటి రసాయనాలు లభ్యమవుతాయి. ఈ ఓషధి ఘనసత్వం ఊబకాయం తగ్గించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో బాగా ఉపయోగిస్తుంది. కొన్ని సందర్భాలలో ఊహించని విధంగా అనుకోకుండా మేలును చేకూర్చే వస్తు సముదాయం మన పక్కనే వుందని గమనించకుండా వుండి ఎవరో చెబితే 'మహౌషధి' అది ఇతరులు చెప్పినపుడు ఆశ్చర్యమవుతుంది. అటువంటి మహౌషధి నల్లేరు.
Share:

నల్లేరు మహౌషధి

వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని సంస్కృతంలో పేరు. హిందీలో 'హడ్ జోడ్'గా పిలువబడే నల్లేరు, విరిగిన ఎముకలు చాలా త్వరితంగా అతుక్కోవడానికి ఉపకరించే ప్రాచీన మహౌషధి. దీనిని భావమిశ్రుడు తన 'భవప్రకాశ' గ్రంథంలో వివరించారు.
'సిసస్ క్వాడ్రాంగులా' లాటిన్ నామధేయముగల నల్లేరును, గ్రామీణంలో వడియాలు, పచ్చళ్లు చేసుకొని ఆహార పదార్థంగా వినియోగించుకుంటారు. దీనిలో విటమిన్‌'సి', కెరోటిన్ ఎ, స్టెరాయిడల్ ధాతువు, కాల్షియం అధిక మొత్తంలో వున్నాయని పరిశోధకులు గుర్తించారు.
కార్టిజోన్ దుష్ఫలితాలను నిలువరించి దాని యాంటీ ఎనబాలిక్ గుణాన్ని సాంద్రతను తగ్గించి, ఎనబాలిక్ ఓషధంగా పరిగణించే 'డ్యూరాబొలిన్'కంటె ఉత్తమ గుణం ఈ 'నల్లేరు'లో వున్నాయని
పరిశోధకులు ధృవీకరించారు. అస్థి ధాతువు వేగంగా ప్రవృద్ధమయేందుకు నల్లేరు విశేషంగా దోహదం చేస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కోడానికి అవసరమయే 'మ్యూకోపాలిసాక్రైడ్స్' దీనిలో విశేషంగా వున్నాయి. ఇవి రక్తము ద్వారా కణజాలములో కలిసి వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది.



నల్లేరు:-నల్లేరు యొక్క సాంకేతిక నామం CISSUS QUADRA GULARIS లేక VITUS QUADRANGU LARIS. ఆంగ్లములో DEVILS BACK BONE అంటారు. దక్షిణ భారతంలో మరియు శ్రీలంకలో ఎక్కువగా లభ్యమవుతుంది.

విరిగిన ఎముకలు అతుక్కోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అస్థిసంహార అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా 1.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కాండం చతురస్రాకారంలో వుంది. 8-10 సెంటీమీటర్ల దగ్గర 'గణుపు' వుంటుంది. ఆ గణుపు దగ్గర వేరు లేక తీగల వంటి CLIMBING ROOTS వస్తాయి. ఆకులు కూడా ఆ గణుపు దగ్గరే వస్తాయి. దీని కాండం ఓషధ ప్రయోగానికి ఉపయోగిస్తుంది. తుంచితే జిగురు వస్తుంది. హిందీలో 'హడ్‌జోడ్'గా పిలుస్తారు.
దీనిలో ఎక్కువ శాతం కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సి, కాల్షియమ్ ఆక్సలేటర్ వంటి రసాయనాలు లభ్యమవుతాయి. ఈ ఓషధి ఘనసత్వం ఊబకాయం తగ్గించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో బాగా ఉపయోగిస్తుంది. కొన్ని సందర్భాలలో ఊహించని విధంగా అనుకోకుండా మేలును చేకూర్చే వస్తు సముదాయం మన పక్కనే వుందని గమనించకుండా వుండి ఎవరో చెబితే 'మహౌషధి' అది ఇతరులు చెప్పినపుడు ఆశ్చర్యమవుతుంది. అటువంటి మహౌషధి నల్లేరు.
Share:

రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స - కొన్ని నియమాలు ... సంపూర్ణ ఆరోగ్యం

ఈ కొన్ని నియమాలను పాటించండి .ఆరోగ్యాన్ని పొందండి .

1. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎటువంటి నీళ్ళు త్రాగవలెను?
     గోరు వెచ్చని . 
2. నీళ్ళు ఎలా త్రాగాలి ?
          సుఖాసనంలో కూర్చొని , గుటక గుటకగా త్రాగాలి . 
3. తినే ఆహారాన్ని ఎన్ని సార్లు నమలాలి ?
     32 సార్లు . 
4. కడుపు నిండా ఆహారం ఎప్పుడు తినాలి ?
   ఉదయం . 



5 . ఉదయం బ్రేక్ ఫాష్ట్ ఎపుడు చేయాలి ?
   సూర్యోదయం అయిన 1 1/2 గంటలోపు తినాలి . 
6  ఉదయం బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం తర్వాత ఏమి త్రాగ వచ్చు ? 
      పండ్ల రసాలు . 
7 మధ్యాహ్న భోజనం తర్వాత ఏమి త్రాగవచ్చు ?
   లస్సి / మజ్జిగ .
8 రాత్రి భోజనం తర్వాత ఏమి త్రాగాలి? 
     పాలు .
9  పండ్లు ఏ సమయంలో తినరాదు ? 
      రాత్రి .
10  ఐస్ క్రీమ్ ఎప్పుడు తిన వచ్చు ?
    తినరాదు . 
11 ఫ్రిజ్ లో వుంచి , బయటకు తీసిన పదార్ధాలు ఎంత సేపటి తర్వాత తినాలి? 
   1 గంట తర్వాత .
12 COOL DRINKS త్రాగ వచ్చా ?
  త్రాగరాదు . 
13  వండిన ఆహారం ఎంత సేపటిలో తినాలి ?
   40 నిమిషాలలోపు . 
14  రాత్రి భోజనం ఎంత తినాలి ?
   మధ్యాహ్నం తిన్న భోజనం కంటే తక్కువ తినాలి . 
15 రాత్రి భోజనం ఎప్పుడు చెయ్యాలి ? 
 సూర్యాస్తమయం లోపల .
16  బ్రేక్ పాష్ట్ , భోజనానికి ముందు నీళ్ళు ఎప్పుడు త్రాగవచ్చు? 
  48 నిమిషాల ముందు . 
17 రాత్రి లస్సీ త్రాగవచ్చా ?
   త్రాగరాదు . 
18. ఉదయం భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?
  పని చెయ్యాలి . 
19 మధ్యాహ్న భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?
  విశ్రాంతి తీసుకోవాలి . 
20 రాత్రి భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?
  500 అడుగులు నడవాలి . 
21 ఎల్లప్పుడు భోజనం చేసిన తర్వాత ఏమి చెయ్యాలి ?
 5 --10 నిమిషాలు వజ్రాసనం వెయ్యాలి .
22 ఉదయం లేచిన తర్వాత కండ్లకు ఏమి పూయాలి ?
  లాలా జలం . 
23 రాత్రి ఎన్ని గంటలకు పడు కోవాలి ?
   9 -- 10 గంటలలోపు . 
24 3  విషాలు ఏవి ?
    చెక్కర , మైదా , తెల్ల ఉప్పు . 
25 మధ్యాహ్న భోజనంలో ఏమి వేసుకొని తినాలి ? 
  వాము .
26  రాత్రి  SALAD తిన వచ్చా ? 
  తినరాదు . 
27  ఎల్లప్పుడు భోజనం ఎలా చెయ్యాలి ?
  సుఖాసనంలో కూర్ఛొని , నమిలి , నమిలి తినాలి . 
28  టీ ( tea ) త్రాగ వచ్చా ?
   త్రాగ రాదు . 
29 పాలలో ఏమి వేసుకొని త్రాగాలి ? 
  పసుపు .
30 పాలలో పసుపు వేసుకొని ఎందుకు త్రాగాలి ? 
  క్యాన్సర్ రాకుండా . 
31 ఏ చికిత్సలు మంచివి ?
   ఆయుర్వేధం . 
32 బంగారు పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ? 
   October ... March.
33 రాగి పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ?
    June ... September. 
34 మట్టి పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ? 
   March .... June. 
35 ఉదయం నీళ్ళు ఎంత త్రాగాలి ? 
  కనీసం  2 లేక 3 గ్లాసులు . 
36 ఉదయం ఎప్పుడు లేవాలి ?  సూర్యోదయానికి  1 1/2 గంట ముందు. 
Share:

జిల్లేడు లేదా అర్క ( Calotropis )

జిల్లేడు:  జిల్లేడు లేదా అర్క (లాటిన్ Calotropis) ఒక పాలుగల చిన్న మందు మొక్క. జిల్లేడులో మూడు జాతులు గలవు. 1. తెల్లజిల్లేడు, 2. ఎర్రజిల్లేడు, 3. రాజుజిల్లేడు.

జిల్లేడు:-ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Calotropis Procera.

ఔషధ గుణాలు:-

ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :

చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
శరీర సమస్యలకు ఉపయోగపడుతుంది.
కీళ్ళ సమస్యలను తగ్గిస్తుంది.



ఈ ఆకు ఎరుపు, తెలుపు, రాజ అను మూడు రంగుల్లో లభిస్తుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.
చెట్టంతా కొంచెము మదపు వాసన కలిగియుండును.
వేరు పొడవుగా నుండును. వేరు పైన గల చర్మము కూడా తెల్లని పాలు కలిగియుండును.
దూది వంటి నూగుతో కప్పబడిన శాఖలతో పెరిగే చిన్నపొద. 2-3 మీటర్ల ఎత్తు వరకు పెరుగును.
అండాకారం నుండి హృదయాకారంలో ఉన్న దళసరిగా పాలు కలిగిన సరళ పత్రాలు. క్రిందిభాగమున ఈనెలుకలిగి, తెల్లని నూగుకలిగి ఉంటాయి.
పార్శ్వ్ అగ్రస్థ నిశ్చిత సమశిఖి విన్యాసంలో అమరి ఉన్న తెలుపు లేడా గులాబీ రంగుతో కూడిన కెంపు రంగు పుష్పాలు. ఇవి గుత్తులు గుత్తులుగా పూయును.
కొడవలి ఆకారంలో ఉన్న జంట ఏకవిదారక ఫలాలు. పండి పగిలిన అందులో తెల్లని మృదువైన దూది యుండును.

జిల్లేడు:-జిల్లేడులో ప్రధానంగా రెండు రకాలు గలవు. ఒకటి ఎర్ర జిల్లేడు, 2. తెల్ల జిల్లేడు.

ఇతర ఉపయోగాలు:-



ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :

పాలను పసుపుతో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖవర్చస్సు పెంపొందుతుంది.
లేత జిల్లేడు చిగుళ్ళను తాటి బెల్లంతో కలిపి కుంకుడు గింజంత మాత్రలుగా చేసి ఆ నాలుగు రోజులు ఉదయం ఒకటి, సాయంత్ర ఒకటి చొప్పున సేవిస్తే స్ర్తీల బహిష్టు నొప్పులు తగ్గుతాయి.

Share:

కొండ పిండి చెట్టు

కిడ్నీలోగాని మూత్ర నాళాల్లో గాని రాళ్లు (స్టోన్స్) ఏర్పడి కొంత మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొంత మంది వేలాది రూపాయలు ఆసుపత్రులకు వెచ్చించి ఆపరేషన్లు చేయించుకుంటారు. మరికొంత మంది రాళ్లు ఏర్పడి వారు స్టోన్స్ కరిగిపోవడం కోసం మందులను వాడుతుంటారు. రాళ్ల సైజును బట్టి కొంతమందికి కరిగిపోవడం జరుగుతుంటుంది. మరికొంత మందికి ఆపరేషన్ తప్పనిసరి అవుతుంది. కాగా రాళ్లను కరిగించడానికి ఆయుర్వేదంలో మందును వినియోగిస్తున్నారు. పూర్వీకుల నుండి చెట్ల మందులు ఆలస్యంగా నైనా ఎక్కువగా పనిచేస్తాయని వాడుతుంటారు. ఇందుకు నిదర్శనమే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడం కోసం కొండపిండి ఆకును వినియోగిస్తున్నారు. ఈ ఆకు పేరు ఎలా వచ్చిందోగాని పేరులోనే ఉంది కొండను పిండిచేసే చెట్టు. 5నుండి 8mmలోపు సైజు రాళ్లు కిడ్నీలో ఏర్పడినట్లు నిర్దారణ కాగానే కొండపిండి ఆకు రసం త్రాగడం ప్రారంభించాలి. ఉదయం పూట పరిగడుపున కొంత కొండపిండి ఆకును తీసుకొని దంచుకొని లేదా మిక్సిలో టీ కప్పు రసం తయారు చేసుకొని అందులో టీ స్పూన్ జిలుకర్ర, నవ్వోతు(పటికబెల్లం) పొడిగా తయారు చేసుకొని కలుపుకొని 5 రోజుల పాటు సేవిస్తే 15 రోజుల వరకు రాళ్లు కరిగి పోవడం లేదా రాళ్లు పడిపోవడం జరుగుతుంది. అంతకన్న ఎక్కువ రోజులు త్రాగిన కలిగే నష్టమేమి ఉండదు.


Share:

గుంట గలగర ఉపయోగాలు

గుంటకలగర లేదా గుంటగలగర ఒక విధమైన ఔషధ మొక్క. ఇది ఆస్టరేసి (Asteraceae) కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం ఎక్లిప్టా ఆల్బా (Eclipta alba). నీటి కాలువలు, గుంటల పక్కన, తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుంటగలిజేరు. గుత్తులుగా ఉన్న తెల్లని చిన్న పూలను పూస్తుంది. సంస్కృతంలో దీన్ని భృంగరాజ అంటారు. మార్కెట్లో చాలా తల నూనెలు గుంటగలగర ఆకులతో తయారు చేస్తున్నారు. వెండ్రుకలు రాలిపోకుండా కాపాడే గుణం దీనిలో ఉండటమే అందుకు కారణం. గుంటగలగర మొక్కలను వేళ్లతో సహా తీసి శుభ్రపరచి నీడలో ఎండబెట్టాలి. దీనికి మార్కెట్లో మంచి అమ్మకపు విలువ వుంటుంది. ఆధునిక పరిశోధనలలో ఇందులో కల ఎక్లిప్టిన్ అనే ఔషధతత్వానికి లివర్ ను బాగుచేయగల శక్తి ఉందని కనుగొన్నారు. ఆయుర్వేద వైద్య విధానంలో గుంటగలిజేరును ప్రధానంగా తల వెండ్రుకలు నల్లగా, వత్తుగా పెరగటానికి, లివరు, చర్మ వ్యాధులలో వాడుతారు.

ఇది ఉబ్బసము, బ్రాంకైటిస్, రుమాటిజమ్ నివారణలో, రక్తస్రావాన్ని అరికట్టడంలో, వెంట్రుకల పెరుగుదలకు వాడే మందుల్లో ఉపయోస్తారు.

పేను కొరుకుడు : తలపైన అక్కడక్కడ ఒక్కమారుగా వెండ్రుకలు రాలిపోయి మచ్చలు మచ్చలుగా అగుపించే దానిని సామాన్యంగా పేనుకొరుకుడు అంటారు. గుంట గలిజేరు మొక్కను వేరుతో సహా సేకరించి మెత్తటి ముద్ద అయ్యేట్లు నూరి పేనుకొరుకుడు గల ప్రదేశాల్లో పూయాలి. ఈ విధంగా ఒక వారం రోజులు చేస్తే వెండ్రుకలు రాలటం ఆగి పోయి కొత్త వెండ్రుకలు వస్తాయి.
చిన్న పిల్లల్లో దగ్గు : గుంటగలిజేరు ఆకులను నీటితో శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి. రెండు చుక్కల రసాన్ని ఒక టీ స్పూన్ (5 మి.లీ) తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే దగ్గు ఉపశమిస్తుంది. గొంతులో గరగర తగ్గిపోతుంది.



వెండ్రుకలు నల్లబారుట : గుంట గలిజేరు మొక్కను వేరుతో సహా మెత్తగా దంచి ముద్ద చేయాలి. దానికి నాలుగు రెట్లు నువ్వులనూనె లేక కొబ్బరినూనె కలిపి సన్నటి సెగపై మరిగించాలి. ఆ మిశ్రమంలోని తేమ ఇగిరిపోయాక నూనెను వడపోయాలి. ఈ గుంటగలగర నూనెను వరుసగా తలకు వాడితే చిన్న వయస్సులో నెరిసిన జుట్టు నల్లబడుతుంది. వెండ్రుకలు రాలిపోవడం ఆగి, కళ్లకు బలం కలుగుతుంది.
పురుగుకాట్లు : చిన్నచిన్న పురుగులు కరిచి అక్కడ దద్దు, వాపు, దురద రావచ్చు. గుంట గలిజేరు ఆకు రసాన్ని కరిచిన చోట పూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
నోరు పూయుట : నోరు పొక్కి, కురుపులు ఏర్పడినప్పుడు పులుపు, కారం, ఉప్పు తినటం కష్టమవుతుంది. నాలుగు గుంట గలిజేరు ఆకులను శుభ్రంగా కడిగి నోటిలో ఉంచుకొని చప్పరిస్తే నోటిలో కురుపులు త్వరగా మానిపోతాయి.
Share:

శరీరాన్ని మైదా పిండి క్రమంగా చంపేస్తుందని తెలుసా..?

మనం బయట తినే చపాతి, దోశ, పరోట, రోటి, తండూరీ.. ఇలా అన్నింటిలోనూ ఎక్కువగా ఉండే పిండి పదార్థం ఏదైనా ఉందంటే అది మైదానే.. మైదా వాడితే పదార్థాలు చూడడానికి ఆకర్షణీయంగానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి. దీంతో ఇక అంతా ఆ హోటల్ లో పలానాది తింటే చాలా బావుందని చెబుతుంటారు. కాని మైదా పిండి వాడడం మూలాన వచ్చే నష్టాలు తెలిస్తే మళ్లీ జన్మలో వాటి జోలికి వెళ్లరు.




మైదాలో విషపూరిత రసాయనాలు…
* మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమ పిండి. పసుపు రంగులో ఉండే గోధుమ పిండిని Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. 
* బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. 
* గోదుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్ లో ఇష్టారీతిన వాడేస్తున్నారు.
మైదా తింటే ఆరోగ్యం ఇలా దెబ్బతింటుంది…
* మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి. అది మైదాలో జీరో. కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఈ ప్రమాదంతో పేగుల్లో పుళ్లు సైతం ఏర్పడతాయి. అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారితే కడుపులో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తాయి.
* సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్టుగా అంటుకుపోతుంది. 
* ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక మన పేగులకూ అలాగే అతుక్కుపోతాయి. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి. అవి ఇన్ఫక్షన్లను కలిగిస్తాయి.
* దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి.
* కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
* గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. 
* మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు.
* కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఇక ప్రొటీన్లు చాలా నామ మాత్రంగా ఉంటాయి.
* మైదాలో glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
* రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారమిచ్చినట్టే.
* స్వలాభం కోసం కష్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం తగ్గిస్తే సరిపోతుంది. 
* ఆరోగ్య స్పృహతో వ్యవహరిస్తే చాలు ఆ ఫుడ్స్ తినాలనిపించదు. కావాలంటే ట్రై చేసి చూడండి.. అందరికీ తెలసేలా షేర్ చేయండి.*
Share:

ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసే కరివేపాకు.

కరివేపాకులో హానికర సూక్ష్మజీవుల్ని నశింపజేసే గుణాలున్నాయి. తద్వారా ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.  పొట్టలోని విషపూరితాలను సైతం కరివేపాకు చక్కగా తొలగిస్తుంది. అజీర్తిని పోగొట్టి జీర్ణశక్తిని పెంచుతుంది.  కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. విరేచనాలు తగ్గాలంటే.. చిన్నరేగుపండు సైజులో కరివేపాకు ముద్దను మజ్జిగతో రెండుమూడుసార్లు తీసుకుంటే సరిపోతుంది.

  కరివేపాకులోని అనేక పోషకాలు శిరోజాలను సంరక్షిస్తాయి. అంతేకాదు, దీన్ని నూరి తలకు పెట్టుకుంటే చుండ్రు తగ్గుతుంది.  దగ్గూ కఫంతో బాధపడుతుంటే టీస్పూను కరివేపాకు పొడిని తేనెతో తీసుకుంటే ఫలితం ఉంటుంది.
 కరివేపాకులోని మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.  కరివేపాకులోని పీచు కారణంగా రక్తంలో చక్కెర నిల్వలు కూడా తగ్గుతాయి. ఇది కొవ్వుని సైతం కరిగిస్తుంది. దాంతో బరువు కూడా తగ్గుతారు.
Share:

రోజ్ వుడ్ ఆకులు నమలి తింటే !

తెలిసిన వారైనా, అపరిచితులైనా సరే వారికి కేన్సర్ ఐతే అది ఏరకమైనదైనా సరే మీరు వారి ఇంటికి వెళ్ళండి, ఆ ఇంట్లో వారికైనా,లేక ఆ పేషంట్ కైనా నచ్చ చెప్పండి అది‌వారు వాడే మందులు వాడుతూ దానితో పాటు రోజ్ వుడ్ (Rose Wood) ఆకుల రసం 10 నుంచి 15 రోజులు తీసుకోవాలి, తరువాత రోజ్ వుడ్ ఆకులుని రోజూ నమలి తినటం మెుదలు పెట్టాలి ,చూస్తుండగానే మీకు రోగిలో అనూహ్యమైన మార్పు రావటం కనిపిస్తుంది. మరియు ఈ రోగం పూర్తిగా నయమౌతుంది. 


Share:

ఆషాడ మాసంలో మునగ కూర తినాలని పెద్దలు చెబుతారు.

మునగను ములగ అని కుడా అంటారు. శిగ్రు, శోభాంజన,కృష్ణగంధ,బహు లచ్చద అని సంస్కృతం  లో పిలుస్తారు. ఏడాదికి ఒక సారియైన ముఖ్యంగా ఆషాడ మాసంలో మునగ కూర తినాలని పెద్దలు చెబుతారు.




ములగాకు చాల బలకరమైంది. దానిలో 5,౦౦౦ యూనిట్ల అ విటమిన్ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇది మలాన్ని గట్టి పరుస్తుంది. అగ్ని దీపనాన్ని చేస్తుంది. కఫాన్ని, వాతాన్ని హరిస్తుంది. మిక్కిలి కాక చేస్తుంది. రక్త పిత్తాన్ని కలిగిస్తుంది. విద్రధిని, ప్లీహ వ్రానాన్ని పోగొడుతుంది. ఇది బహు పత్యకరి.
శరీరం లోని చేదు నీటిని బయటకు పంపడానికి ఇది పెట్టింది పేరు. ఇది దృష్టిమాంద్యాన్ని పోగొడుతుంది. స్రీలకు ఇది చాల మంచిది. 'ముట్టునీళ్ళ నాడు మునగాకు కూర' అని సామెత. అంటే ఇది ముట్టునీళ్ళ నాడు మునగాకు తినడం పత్యకరమై ఉందని అర్ధం.
Share:

తినేటపుడు నీరు తాగితే నష్టమేమిటి?

కొంతమంది నీరు తాగి వెంటనే తినడం మొదలు పెడతారు. మరికొందరు తినేటపుడు తాగితే, ఇంకొందరు తిన్నాక తాగుతారు. ఇలా నీటిని తాగటం జీర్ణక్రియకు ఇబ్బందిని కలిగించడమే. మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి పొట్టలో హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ ఊరుతుంది. ఆ యాసిడ్‌ మన ఆహారంతో డైరెక్టుగా కలిస్తే ఆహారం త్వరగా అరిగి పిండిపిండిగా విడగొట్టబడుతుంది. ఇలా జరగకుండా, మనం తినేటపుడు తాగిన నీరు పొట్టలోనికి వెళ్లి, లోపల ఊరిన హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని పలుచగా (యాసిడ్‌కి నీరు కలిపితే గాఢత లేదా పవర్‌ తగ్గిపోతుంది.) చేసేస్తుంది. దాంతో జీర్ణక్రియకు మామూలు కంటే రెట్టింపు సమయం పడుతుంది. 



తినేటపుడు నీరు తాగటం వల్ల వచ్చే నష్టాలు చూస్తే, భుక్తాయాసం రావటం, కడుపులో మంటలు రావటం, అజీర్ణం కలగటం, ఆహారం ఎక్కువ సేపు నిలువ ఉండి పులవడం, గ్యాసు తయారవడం, త్రేన్పులు ఎక్కువగా రావడం, పొట్ట సాగిపోవడం మొదలగునవి అన్నీ వస్తూ ఉంటాయి. తినేటపుడు నీటిని తాగడం అసహజం. పండ్లు, పచ్చి కూరలు తిన్నపుడు మీరు బాగా నమిలి తింటున్నారు కాబట్టి గొంతు పట్టడం గానీ, ఎక్కిళ్లు గానీ రావు. ఆహారాన్ని మెత్తగా పిండిపిండిగా నమిలి, మెల్లగా తింటూ ఉంటే తినేటపుడు నీటి అవసరం రాదు. కొత్తలో వారం, పది రోజులు కొంచెం ఇబ్బందిగా ఉన్నా మెల్లగా అలవాటు అయి, మీకు తిన్నాక ఎంతో హాయి అనిపిస్తుంది. బద్దలు, నీళ్లు కలిపి పోసి రోటిలో రుబ్బితే పిండి నలగదు కాబట్టే ముందు బద్దలను రుబ్బి ఆ తర్వాత నీరు కలుపుకోవడం మన అలవాటు. అలాగే ఇక నుంచి మీ పొట్టలో కూడా అలాగే రుబ్బుకోవడానికి ప్రయత్నించండి.
Share:

మొదటి ముద్దను కరివేపాకు పొడితో తింటే...?

తాలింపులో సుగంధద్రవ్యంగా కరివేపాకును వాడుతారు. ఈ విధంగా అవసరానికి మన ఇంట్లో లేకపోయినా పక్కింటి వాళ్ళనయినా రెండు రెమ్మలు అడిగి తీసుకొని మరీ వాడుకునే ఈ కరివేపాకును తినేటప్పుడు మాత్రం తీసి పక్కన పడేస్తూ వుంటారు. కరివేపాకు అంత తీసిపారేయదగ్గ పదార్ధం కాదు. కరివేపాకులో ఎన్నో ఔషధగుణాలు వున్నాయి.
ప్రతి యింట్లో వేపచెట్టు వుండాలని పెద్దలు చెబుతారు. వేపచెట్టు నుండి వీచే గాలి ద్వారానే పలు రోగాలు నయం అవతాయంటారు. అలానే కరివేపాకు చెట్టు నుండి వీచే గాలి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాతవరణం కాలుష్యభరితం అయినపుడు ఆ ప్రదేశాలలో కరివేపాకు చెట్టు నాటితే వాతవరణం శుభ్రపడుతుంది.

కరివేపాకు చెట్టులో ఆకులు, బెరడు, వేరు, గింజలు, పూలు అన్నీ ఔషధగుణాలు కలిగివున్నాయి. కరివేపాకు పేగులకు, ఉదరమునకు బలాన్నివ్వడమే కాక శరీరానికి కాంతిని కలిగిస్తుంది, రంగునిస్తుంది. ఆహార పదార్థాలకు రుచిని కలిగించడమే కాక, అజీర్తిని నివారించి ఆకలిని పుట్టిస్తుంది.
ఎలర్జీని కలిగించే వ్యాధులనూ, ఉబ్బసం, ఉదయాన్నే లేచిన వెంటనే తుమ్ములు ప్రారంభం అవుతన్నప్పుడు జలుబుతో తరచుగా బాధపడుతున్నవారూ, ప్రతిరోజ ఆహారంలో మొదటి ముద్దను కరివేపాకు పొడితో తినడం వలన ఎంతో ఉపయోగం వుంటుంది.
గర్భధారణ జరిగిన తరువాత కడుపుతో వున్న తర్వాత కడుపుతో వున్న తల్లికి, బిడ్డకు తగినంత రక్తం అందాలంటే మందులతోపాటు కరివేపాకు పొడిని కూడా యివ్వాలి. బాలింతలకు కూడా ఇది వాడవచ్చు. ఎలాంటి పథ్యము లేదు. రక్తవిరేచనాలు, జిగట విరేచనాలు, అవుతున్నప్పుడు కరివేపాకు పొడిని వట్టిది వాడకం కంటే మజ్జిగలో కలుపుకొని రెండు లేక మూడుసార్లు వాడితే మంచి ఫలితం వుంటుంది. గ్యాస్ ట్రబుల్ వున్నవారు, కడుపు ఉబ్బరంగా వుండి వాయువులు వెలువడుతుంటే వారు ఆహారంలో తరచుగా వాడుతుండాలి. 
మొలలు వ్యాధితో బాధపడే వారికి ఈ ఆకు బాగా పనిచేస్తుంది. కరివేపాకు చెట్టు బెరడు కూడా వైద్యానికి పనికివస్తుంది. దీనిని మెత్తగా నూరి కాస్తంత నీరు కలిపి దురదలు, పొక్కులు వున్నప్పుడు వాటిపై రాసి ఆరిన తరువాత స్నానం చేస్తే తగ్గుతాయి. కరివేపాకు కేన్సర్ వ్యాధిలో ఎంతో ఉపయోగకారి అని నవీన పరిశోధనలు చెబుతున్నాయి.
కరివేపాకు కారం తయారు చేసే విధానం: కరివేపాకు ఎక్కువ పాళ్ళు వుండే విధంగా వుంటే మంచి ఫలితం వుంటుంది. జీలకర్ర, ధనియాలు, ఎండబెట్టిన కరివేపాకు ఈ మూడింటినీ విడివిడిగా నేతిలో వేయించాలి. వీటిని మెత్తగా దంచి, మెత్తగా అయిన తర్వాత ఉప్పును తగినంత వేసి భద్రపరుచుకోవాలి. ఏదైనా బ్రేక్‌ఫాస్ట్, అన్నంలోను ఈ పొడిని కలపుకొని తినవచ్చు. మంచి ఫలితం వుంటుంది.
Share:

కర్పూరం గురించి..

కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.
ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. అండి కర్పూరం కాంఫర్ లారెల్ లేదా Cinnamomum camphora (కుటుంబం: లారేసీ ) అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.


కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతుంది.
పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.
హారతి కర్పూరం: టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.
రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.
భీమసేని కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.
సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
హిమవాలుక కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
ఘనసార కర్పూరం: ఇది మేఘంలాంటి సారం కలిగినది. 
హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.
ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.
కర్పూరంవలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:
1. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.
2. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.
3. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.
4. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.
5. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.
6. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.
7. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.
8. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.
9. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.
10 మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.
11.రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.
12.అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.
13. దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.
14. పురుగుల మందులు, చెడువాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి, కర్పూరాన్ని విరివిగా వాడుతారు.
15. తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి పట్టిస్తే తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
16. పెయింటింగ్, బాణాసంచా, సహజమైన పరిమళాలు, సబ్బులు తయారీలో కర్పూరం వాడుతారు.
17. కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో కూడా సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తారు.
18. అలానే అరబకెట్నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఇంటిని తుడిస్తే ఫ్లోర్మీద ఈగలు వాలవు.
19. కర్పూరం ఉన్న పేస్ట్లను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి.
20. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని త్రాగే నీటిలో కూడా కలుపుకుని మరీ త్రాగుతారట. తద్వారా కలుషిత నీరు సైతం శుభ్రపడి స్వచ్ఛంగా ఉంటాయట.
Share:

ముల్లంగి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..:-

జాండిస్(కామెర్ల)నుండి కాపాడుతుంది: ముల్లంగిని తినడం వల్ల లివర్ మరియు కడుపును మంచి కండీషన్ లో పెడుతుంది. అంతే కాదు, శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఇంకా ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ ను సప్లై చేస్తుంది. ముల్లంగి ఆకులను మరియు బ్లాక్ రాడిష్ ను జాండిస్ నివారణకు ఉపయోగిస్తారు.


పైల్స్(మెలలు)నివారణకు: ముల్లంగి శరీరంలోని విషాలను బయటకు నెట్టేసే గుణాలు చాలా ఉన్నాయి. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పైల్స్ నివారణకు బాగా సహాయపడుతుంది. పైల్స్ అధికంగా కాకుండా అడ్డుకుంటుంది. ముల్లంగి జ్యూస్ మన జీర్ణక్రియకు బాగా సహాయపడి పైల్స్ రాకుండా అడ్డుపడుతుంది.

మూత్ర సంబంధిత వ్యాధులను కంట్రోల్ చేస్తుంది: ముల్లంగిలో ఉండే డ్యూరెటిక్, ఇది శరీరంలో యూరిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ఏర్పడే మలినాలను తొలగించడానికి, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి మరియు యూరినేటింగ్ సమయంలో ఏర్పడే బర్నింగ్ సెన్షేషన్ వంటి వాటికి నివారిణిగా పనిచేస్తుంది. ముల్లంగిని తరచూ ఆహారంతో తీసుకోవడం వల్ల శరీరంలో మలినాలను బయటకు పంపడానికి సహాయపడే కిడ్నీలు మరియు యూరినరీ సిస్టమ్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.
బరువు నియంత్రణ: బరువు తగ్గాలనుకొనే వారికి ముల్లంగి చాలా ఉపయోగకరం. ముల్లంగిలో జీర్ణక్రియ సక్రమంగా జరిగి విరేచనము సాఫీగా జరిగేందుకు ఉపయోగపడే పీచుపదార్థం మరియు కార్బోహైడ్రేట్స్ తో కలిగిన నీరును కలిగి ఉంటుంది. అందువల్ల బరువు పెరుగేందుకు సహకరించదు. ముల్లంగి క్యాలరీలు పెంచ కుండానే ఆకలిని సంత్రుప్తి పరుస్తుంది.
క్యాన్సర్ నివారిణి: ముల్లంగిని మన డైలీ డయట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ (కోలన్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్, కిడ్నీ కాన్సర్, మరియు ఓరల్ క్యాన్సర్ )లను రాకుండా కాపాడుతుంది.
Share:

Labels