సోరకాయా ....... మజాకా

100 గ్రాముల సొరకాయ తింటే దాని ద్వారా సమకుఉరేది కేవలం 15 క్యాలరీలు మాత్రమే. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది.


సోరకాయలో తొంభై ఆరు  శాతం నీరే. ఇందులో విటమిన్ సి, రిబోఫ్లావిన్, జింక్, థయామిన్ , ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. నీరసంగా ఉన్నవారు అలసటగా ఉన్నవారు దీనిని ఎక్కువగా సేవిస్తే శక్తి తొందరగా సమకూరుతుంది.

 

100 గ్రాముల సోరకాయలో కేవలం 1 గ్రాము కొవ్వు మాత్రమే ఉంది. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులున్నవారు దీనిని ఆహారంగా తీసుకోవాలి.

 

సోరకాయలో పీచు పదార్ధం ఎక్కువ పాళ్ళల్లో ఉండడం వలన మల బద్ధకం నివారిస్తుంది. గ్యాస్ సమస్యలు ఉన్నవారు దీనిని సేవిస్తే మంచిది.

 

ఉబకాయం ఉన్నవారికి  ఇందులో డయటరి ఫైబర్ ఉండడం వలన తొందరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది, అధిక బరువు తగ్గడంలో బాగా సహాయం చేస్తుంది.



సొరకాయ కాలేయానికి మేలు చేస్తుంది. దాని పని తీరుని మెరుగు పరుస్తుంది.

 

పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన బీపీ వున్నా వారు దీనిని విరివిగా వాడవచ్చు.  

Share:

ఇంగువ ప్రాముఖ్యత

మరిగించిన ఇంగువకు సమానంగా నల్ల ఉప్పు కలిపి చూర్ణం చేసుకోవాలి. తేనెలో పిసర గింజంతపరిమాణంలో ఈ చూర్ణం కలిపి నాకిస్తే, పిల్లలలోని కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిపోతాయి.

ఇంగువను కొంచెం వేడి చేసి పంటిలో ఉంచితే బాధ ఉపసమిస్తుంది.

పొంగించిన అర గ్రాము ఇంగువను ఆవు నెయ్యితో కలిపి ప్రతి రోజు సేవిస్తే దగ్గు తగ్గు తుంది.



10 గ్రాముల హారతి కర్పురంలో, 10 గ్రాముల పొంగించిన ఇంగువ కలిపి నూరి, కంద గింజ సైజు మాత్రలు చేసుకొని పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పుఉతల వేడి నీటితో వేసుకుంటే కడుపు ఉబ్బరం నుంచి ఉపసమనం లభిస్తుంది.

పెసర గింజంత ఇంగువను నీళ్ళల్లో కరిగించి, నొప్పి ఉన్న వైపు ముక్కుల్లో మూడు చుక్కలు వేసుకొని నస్యంగా పీలిస్తే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.


ఇంగువ , సైంధవ లవణం , సొంటి ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకొని 30 గ్రాముల ఆవనూనె లో కలిపి నూనె మాత్రమే మిగిలేలా వేడి చేయాలి. ఆ నూనె నాలుగు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి పోటు మాయం అవుతుంది.

 

పొంగించిన ఇంగువను మంచినీళ్ళలో అరగదీసి, ఆ గంధాన్ని కాలిన చోట లేపనంగా వేస్తేకాలిన గాయాలు,బొబ్బలు మాని పోతాయి.


 

 

Share:

నడుము నొప్పి ఉందా ? అయితే ఇలా నివారిద్దాం

నూరిన అల్లం ముద్దను నడుము ఫై పూసి మర్దన చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది. దీన్ని యూకలిప్ట్ నూనెతో కలిపి మర్దన చేస్తే ఇంకా మంచిది.

ఆవనూనె, నువ్వులనూనె వేడి చేసి నడుముకు మర్దన చేసు కొని వేడి నీళ్ళతో స్నానం చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది.



నడుము నొప్పితో బాధ పడేవారు వంకాయ, వేరుశనగనూనె,మినప పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.

Share:

కలబంద తో ఉపయోగాలు

ముదరని కలబంద ఆకుల గుజ్జుని తీసి డానికి ఉప్పు, పసుపు కలిపి 15 రోజుల పాటు ఒక్కసారి చొప్పున తీసుకుంటే .....

జీర్ణకోశంలోని సూక్ష్మక్రిములన్ని చంపేస్తుంది.

జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది.

క్లోమ గ్రంధి ని శుద్ధి చేస్తుంది.

కాలేయ విధులను సక్రమం చేస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది



Share:

బానపొట్ట ఉందని బాధపడుతున్నారా?


పిప్పళ్ళు (లాంగ్ పెప్పర్) ను పొడి చేసి తేనెతో కలుపుకొని ఉదయం, రాత్రి భోజనం చేసిన గంట తరువాత తింటే బాన పొట్ట తగ్గుతుంది. అధిక బరువు చాన వేగంగా తగ్గుతారు.





 

పిప్పళ్ళు పొడి చేసుకొని బెల్లంతో కలిపి తింటే దగ్గు, అస్తమా తగ్గిపోతాయి. పేగుల్లో పురుగులు నశిస్తాయి.

 

పిప్పళ్ళు కషాయం తాగితే కీళ్ళ నొప్పులు తగ్గి పోతాయి, వాపులు వుండవు.

Share:

Labels