ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి

ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.కాచిచలార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్లు కరిగిపోతాయని అంటున్నారు. అల్లంరసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుందంటున్నారు.పొట్టలో నులిపురుగులు నశిస్తాయని, జలుబు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్‌ స్పూన్‌ తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

​

 బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గు ముఖం పడతాయని నిపుణులు వాపోతున్నారు. అంతేకాకుండా తులసీ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తుంది.అల్సర్‌ల నుండి రక్షిస్తుంది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా నియంత్రిస్తుంది. కాలేయం శక్తివంతంగా పనిచేయడానికి దోహదపడుతుంది. నోటినుండి దుర్వాసన వెలువడకుండా నిషేధిస్తుంది.
అలర్జీల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎండవల్ల సోకే అలర్జీలు, పొగ, దుమ్ము నుండి శరీరానికి కలిగే హానిని అరికడుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. దాదాపు అందరి ఇళ్లలోనూ ప్రధాన ద్వారానికి ఎదు రుగా లేదంటే పెరట్లో తులసి మొక్క ఉంటుంది. ఎందుకంటే తులసి ఆకుల నుంచి వచ్చే సువాసన ఇల్లంతా పరుచుకొని మంచి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తూ వ్యాధులు రాకుండా చేస్తుందని విశ్వసిస్తారు. తులసి ఆకులను చప్పరించడం వల్ల దానిలో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తులసి ఆకులో ఉండే రసం ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అందుకే చాలా దేవాలయాలలో తీర్ధంలో తలసీ దళాలను వేసిస్తారు.
Share:

నల్లేరు మహౌషధి

వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని సంస్కృతంలో పేరు హిందీలో 'హడ్ జోడ్'గా పిలువబడే నల్లేరు, విరిగిన ఎముకలు చాలా త్వరితంగా అతుక్కోవడానికి ఉపకరించే ప్రాచీన మహౌషధి. దీనిని భావమిశ్రుడు తన 'భవప్రకాశ' గ్రంథంలో వివరించారు.
'సిసస్ క్వాడ్రాంగులా' లాటిన్ నామధేయముగల నల్లేరును, గ్రామీణంలో వడియాలు, పచ్చళ్లు చేసుకొని ఆహార పదార్థంగా వినియోగించుకుంటారు. దీనిలో విటమిన్‌'సి', కెరోటిన్ ఎ, స్టెరాయిడల్ ధాతువు, కాల్షియం అధిక మొత్తంలో వున్నాయని పరిశోధకులు గుర్తించారు.
కార్టిజోన్ దుష్ఫలితాలను నిలువరించి దాని యాంటీ ఎనబాలిక్ గుణాన్ని సాంద్రతను తగ్గించి, ఎనబాలిక్ ఓషధంగా పరిగణించే 'డ్యూరాబొలిన్'కంటె ఉత్తమ గుణం ఈ 'నల్లేరు'లో వున్నాయని
పరిశోధకులు ధృవీకరించారు. అస్థి ధాతువు వేగంగా ప్రవృద్ధమయేందుకు నల్లేరు విశేషంగా దోహదం చేస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కోడానికి అవసరమయే 'మ్యూకోపాలిసాక్రైడ్స్' దీనిలో విశేషంగా వున్నాయి. ఇవి రక్తము ద్వారా కణజాలములో కలిసి వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది.

​

నల్లేరు:-నల్లేరు యొక్క సాంకేతిక నామం CISSUS QUADRA GULARIS లేక VITUS QUADRANGU LARIS. ఆంగ్లములో DEVILS BACK BONE అంటారు. దక్షిణ భారతంలో మరియు శ్రీలంకలో ఎక్కువగా లభ్యమవుతుంది.

విరిగిన ఎముకలు అతుక్కోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అస్థిసంహార అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా 1.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కాండం చతురస్రాకారంలో వుంది. 8-10 సెంటీమీటర్ల దగ్గర 'గణుపు' వుంటుంది. ఆ గణుపు దగ్గర వేరు లేక తీగల వంటి CLIMBING ROOTS వస్తాయి. ఆకులు కూడా ఆ గణుపు దగ్గరే వస్తాయి. దీని కాండం ఓషధ ప్రయోగానికి ఉపయోగిస్తుంది. తుంచితే జిగురు వస్తుంది. హిందీలో 'హడ్‌జోడ్'గా పిలుస్తారు.
దీనిలో ఎక్కువ శాతం కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సి, కాల్షియమ్ ఆక్సలేటర్ వంటి రసాయనాలు లభ్యమవుతాయి. ఈ ఓషధి ఘనసత్వం ఊబకాయం తగ్గించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో బాగా ఉపయోగిస్తుంది. కొన్ని సందర్భాలలో ఊహించని విధంగా అనుకోకుండా మేలును చేకూర్చే వస్తు సముదాయం మన పక్కనే వుందని గమనించకుండా వుండి ఎవరో చెబితే 'మహౌషధి' అది ఇతరులు చెప్పినపుడు ఆశ్చర్యమవుతుంది. అటువంటి మహౌషధి నల్లేరు.
Share:

నల్లేరు మహౌషధి

వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని సంస్కృతంలో పేరు. హిందీలో 'హడ్ జోడ్'గా పిలువబడే నల్లేరు, విరిగిన ఎముకలు చాలా త్వరితంగా అతుక్కోవడానికి ఉపకరించే ప్రాచీన మహౌషధి. దీనిని భావమిశ్రుడు తన 'భవప్రకాశ' గ్రంథంలో వివరించారు.
'సిసస్ క్వాడ్రాంగులా' లాటిన్ నామధేయముగల నల్లేరును, గ్రామీణంలో వడియాలు, పచ్చళ్లు చేసుకొని ఆహార పదార్థంగా వినియోగించుకుంటారు. దీనిలో విటమిన్‌'సి', కెరోటిన్ ఎ, స్టెరాయిడల్ ధాతువు, కాల్షియం అధిక మొత్తంలో వున్నాయని పరిశోధకులు గుర్తించారు.
కార్టిజోన్ దుష్ఫలితాలను నిలువరించి దాని యాంటీ ఎనబాలిక్ గుణాన్ని సాంద్రతను తగ్గించి, ఎనబాలిక్ ఓషధంగా పరిగణించే 'డ్యూరాబొలిన్'కంటె ఉత్తమ గుణం ఈ 'నల్లేరు'లో వున్నాయని
పరిశోధకులు ధృవీకరించారు. అస్థి ధాతువు వేగంగా ప్రవృద్ధమయేందుకు నల్లేరు విశేషంగా దోహదం చేస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కోడానికి అవసరమయే 'మ్యూకోపాలిసాక్రైడ్స్' దీనిలో విశేషంగా వున్నాయి. ఇవి రక్తము ద్వారా కణజాలములో కలిసి వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది.

​

నల్లేరు:-నల్లేరు యొక్క సాంకేతిక నామం CISSUS QUADRA GULARIS లేక VITUS QUADRANGU LARIS. ఆంగ్లములో DEVILS BACK BONE అంటారు. దక్షిణ భారతంలో మరియు శ్రీలంకలో ఎక్కువగా లభ్యమవుతుంది.

విరిగిన ఎముకలు అతుక్కోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అస్థిసంహార అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా 1.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కాండం చతురస్రాకారంలో వుంది. 8-10 సెంటీమీటర్ల దగ్గర 'గణుపు' వుంటుంది. ఆ గణుపు దగ్గర వేరు లేక తీగల వంటి CLIMBING ROOTS వస్తాయి. ఆకులు కూడా ఆ గణుపు దగ్గరే వస్తాయి. దీని కాండం ఓషధ ప్రయోగానికి ఉపయోగిస్తుంది. తుంచితే జిగురు వస్తుంది. హిందీలో 'హడ్‌జోడ్'గా పిలుస్తారు.
దీనిలో ఎక్కువ శాతం కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సి, కాల్షియమ్ ఆక్సలేటర్ వంటి రసాయనాలు లభ్యమవుతాయి. ఈ ఓషధి ఘనసత్వం ఊబకాయం తగ్గించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో బాగా ఉపయోగిస్తుంది. కొన్ని సందర్భాలలో ఊహించని విధంగా అనుకోకుండా మేలును చేకూర్చే వస్తు సముదాయం మన పక్కనే వుందని గమనించకుండా వుండి ఎవరో చెబితే 'మహౌషధి' అది ఇతరులు చెప్పినపుడు ఆశ్చర్యమవుతుంది. అటువంటి మహౌషధి నల్లేరు.
Share:

రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స - కొన్ని నియమాలు ... సంపూర్ణ ఆరోగ్యం

ఈ కొన్ని నియమాలను పాటించండి .ఆరోగ్యాన్ని పొందండి .

1. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎటువంటి నీళ్ళు త్రాగవలెను?
     గోరు వెచ్చని . 
2. నీళ్ళు ఎలా త్రాగాలి ?
          సుఖాసనంలో కూర్చొని , గుటక గుటకగా త్రాగాలి . 
3. తినే ఆహారాన్ని ఎన్ని సార్లు నమలాలి ?
     32 సార్లు . 
4. కడుపు నిండా ఆహారం ఎప్పుడు తినాలి ?
   ఉదయం . 

​

5 . ఉదయం బ్రేక్ ఫాష్ట్ ఎపుడు చేయాలి ?
   సూర్యోదయం అయిన 1 1/2 గంటలోపు తినాలి . 
6  ఉదయం బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం తర్వాత ఏమి త్రాగ వచ్చు ? 
      పండ్ల రసాలు . 
7 మధ్యాహ్న భోజనం తర్వాత ఏమి త్రాగవచ్చు ?
   లస్సి / మజ్జిగ .
8 రాత్రి భోజనం తర్వాత ఏమి త్రాగాలి? 
     పాలు .
9  పండ్లు ఏ సమయంలో తినరాదు ? 
      రాత్రి .
10  ఐస్ క్రీమ్ ఎప్పుడు తిన వచ్చు ?
    తినరాదు . 
11 ఫ్రిజ్ లో వుంచి , బయటకు తీసిన పదార్ధాలు ఎంత సేపటి తర్వాత తినాలి? 
   1 గంట తర్వాత .
12 COOL DRINKS త్రాగ వచ్చా ?
  త్రాగరాదు . 
13  వండిన ఆహారం ఎంత సేపటిలో తినాలి ?
   40 నిమిషాలలోపు . 
14  రాత్రి భోజనం ఎంత తినాలి ?
   మధ్యాహ్నం తిన్న భోజనం కంటే తక్కువ తినాలి . 
15 రాత్రి భోజనం ఎప్పుడు చెయ్యాలి ? 
 సూర్యాస్తమయం లోపల .
16  బ్రేక్ పాష్ట్ , భోజనానికి ముందు నీళ్ళు ఎప్పుడు త్రాగవచ్చు? 
  48 నిమిషాల ముందు . 
17 రాత్రి లస్సీ త్రాగవచ్చా ?
   త్రాగరాదు . 
18. ఉదయం భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?
  పని చెయ్యాలి . 
19 మధ్యాహ్న భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?
  విశ్రాంతి తీసుకోవాలి . 
20 రాత్రి భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?
  500 అడుగులు నడవాలి . 
21 ఎల్లప్పుడు భోజనం చేసిన తర్వాత ఏమి చెయ్యాలి ?
 5 --10 నిమిషాలు వజ్రాసనం వెయ్యాలి .
22 ఉదయం లేచిన తర్వాత కండ్లకు ఏమి పూయాలి ?
  లాలా జలం . 
23 రాత్రి ఎన్ని గంటలకు పడు కోవాలి ?
   9 -- 10 గంటలలోపు . 
24 3  విషాలు ఏవి ?
    చెక్కర , మైదా , తెల్ల ఉప్పు . 
25 మధ్యాహ్న భోజనంలో ఏమి వేసుకొని తినాలి ? 
  వాము .
26  రాత్రి  SALAD తిన వచ్చా ? 
  తినరాదు . 
27  ఎల్లప్పుడు భోజనం ఎలా చెయ్యాలి ?
  సుఖాసనంలో కూర్ఛొని , నమిలి , నమిలి తినాలి . 
28  టీ ( tea ) త్రాగ వచ్చా ?
   త్రాగ రాదు . 
29 పాలలో ఏమి వేసుకొని త్రాగాలి ? 
  పసుపు .
30 పాలలో పసుపు వేసుకొని ఎందుకు త్రాగాలి ? 
  క్యాన్సర్ రాకుండా . 
31 ఏ చికిత్సలు మంచివి ?
   ఆయుర్వేధం . 
32 బంగారు పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ? 
   October ... March.
33 రాగి పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ?
    June ... September. 
34 మట్టి పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ? 
   March .... June. 
35 ఉదయం నీళ్ళు ఎంత త్రాగాలి ? 
  కనీసం  2 లేక 3 గ్లాసులు . 
36 ఉదయం ఎప్పుడు లేవాలి ?  సూర్యోదయానికి  1 1/2 గంట ముందు. 
Share:

జిల్లేడు లేదా అర్క ( Calotropis )

జిల్లేడు:  జిల్లేడు లేదా అర్క (లాటిన్ Calotropis) ఒక పాలుగల చిన్న మందు మొక్క. జిల్లేడులో మూడు జాతులు గలవు. 1. తెల్లజిల్లేడు, 2. ఎర్రజిల్లేడు, 3. రాజుజిల్లేడు.

జిల్లేడు:-ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Calotropis Procera.

ఔషధ గుణాలు:-

ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :

చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
శరీర సమస్యలకు ఉపయోగపడుతుంది.
కీళ్ళ సమస్యలను తగ్గిస్తుంది.

​

ఈ ఆకు ఎరుపు, తెలుపు, రాజ అను మూడు రంగుల్లో లభిస్తుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.
చెట్టంతా కొంచెము మదపు వాసన కలిగియుండును.
వేరు పొడవుగా నుండును. వేరు పైన గల చర్మము కూడా తెల్లని పాలు కలిగియుండును.
దూది వంటి నూగుతో కప్పబడిన శాఖలతో పెరిగే చిన్నపొద. 2-3 మీటర్ల ఎత్తు వరకు పెరుగును.
అండాకారం నుండి హృదయాకారంలో ఉన్న దళసరిగా పాలు కలిగిన సరళ పత్రాలు. క్రిందిభాగమున ఈనెలుకలిగి, తెల్లని నూగుకలిగి ఉంటాయి.
పార్శ్వ్ అగ్రస్థ నిశ్చిత సమశిఖి విన్యాసంలో అమరి ఉన్న తెలుపు లేడా గులాబీ రంగుతో కూడిన కెంపు రంగు పుష్పాలు. ఇవి గుత్తులు గుత్తులుగా పూయును.
కొడవలి ఆకారంలో ఉన్న జంట ఏకవిదారక ఫలాలు. పండి పగిలిన అందులో తెల్లని మృదువైన దూది యుండును.

జిల్లేడు:-జిల్లేడులో ప్రధానంగా రెండు రకాలు గలవు. ఒకటి ఎర్ర జిల్లేడు, 2. తెల్ల జిల్లేడు.

ఇతర ఉపయోగాలు:-

ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :

పాలను పసుపుతో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖవర్చస్సు పెంపొందుతుంది.
లేత జిల్లేడు చిగుళ్ళను తాటి బెల్లంతో కలిపి కుంకుడు గింజంత మాత్రలుగా చేసి ఆ నాలుగు రోజులు ఉదయం ఒకటి, సాయంత్ర ఒకటి చొప్పున సేవిస్తే స్ర్తీల బహిష్టు నొప్పులు తగ్గుతాయి.

Share:

Labels